Site icon వసుంధర అక్షరజాలం

ఆహ్వానం – 7వ ప్రపంచ సాహితీ సదస్సు

ఆహ్వానం
7వ ప్రపంచ సాహితీ సదస్సు
(అక్టోబర్ 10-11 ‘Youtube’ లో ప్రత్యక్ష ప్రసారం)

అమెరికాలోని వంగూరి చిట్టెన్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10-11 తేదీలలో 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరుగనున్నది. హ్యూస్టన్ (అమెరికా) లండన్ (యూకే) జోహనెస్ బర్గ్ (దక్షిణాఫ్రికా) ఇండియా, సింగపూర్, మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా) నగరాలలో ఆయా దేశాల కాలమానం ప్రకారం మొత్తం 15 వేదికల నుంచి 24 గంటల పాటు ఏకధాటిగా నిర్వహింపడే ఈ సదస్సును భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 10 శనివారం మధ్యాహ్నం గం. 1.30 ని. లకు భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం.వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు.

ఈ సదస్సులో దాసుభాషితం కూడా పాల్గొంటోందని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను. అక్టోబర్ 10 వ తేదీ శనివారం భారత కాలమానం సాయంత్రం గం. 5 30 ని లకు జోహనెస్ బర్గ్ నుంచి ప్రసారమయ్యే రెండవ వేదికలో,‘దాసుభాషితం’ సీఈవో శ్రీ కొండూరు కిరణ్ కుమార్, సాహిత్యమూ-సాంకేతికమూ అనే అంశం మీద ప్రసంగిస్తారు.

పూర్తి వివరాలకు ఆహ్వానపత్రం చూడండి.

Exit mobile version