Site icon వసుంధర అక్షరజాలం

కార్టూన్ పోటీ

పదివేల రూపాయల బహుమతి కొత్త కొత్త ఆలోచనల కోసం కార్టూనిస్టు నిరంతరం ఆలోచిస్తూనే ఉండాలి. తన ప్రపంచంలో మేధోమధనం చేయాలి. అయితే ఆ కృషికి ఆర్థికంగా తగిన ప్రోత్సాహం లభించదు. కేవలం ఆ రంగం మీద ఉన్న ప్రేమతో బొమ్మలు గీస్తూ ఉంటాడు. అలాంటి వారికి వెన్నుగా నిలబడింది హాస్యానందం. దానికి నావంతు ఉడతాభక్తిగా పదివేల రూపాయల బహుమతి అందజేయమని కోరుతున్నాను. పోటీ మాత్రం వినూత్న రీతిలో ఉండాలి. “కొత్త కళాకారునికి” బొమ్మలో ప్రావీణ్యం లేకపోయినా, ఆలోచనకి ప్రోత్సహo ఇస్తే బాగుంటుంది. మంచి ఆలోచన ఉన్న FB మిత్రులు ఇందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానం.నిబంధనలు: 1. ఒక్కొక్కరు ఒక కార్టూన్ మాత్రమే పంపాలి 2. కార్టూన్ మీద సంతకం చేయకుండా మరో పేపర్‌పై సంతకం చేసి పంపాలి. 3. కార్టూన్ చేరాల్సిన ఆఖరి తేదీ : నవంబర్ 10, 2020. కార్టూన్ hasyanandampoteelu@gmail.com కి పంపాలి.న్యాయ నిర్ణేతల ఎంపిక 5 కార్టూన్లకి (ఒకోదానికి) 1000 రూపాయలు, వీటిలో ఎక్కువ మంది పాఠకులు మెచ్చిన కార్టూన్‌కి 5000 రూపాయలు. మొత్తం పదివేల రూపాయల నగదు పారితోషికం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ అందజేస్తారు.

Exit mobile version