అక్టోబర్ 13, 2020

రాధికా సాంత్వనము – వెబినార్

Posted in కవితాజాలం, భాషానందం, సాహితీ సమాచారం at 11:12 ఉద. by వసుంధర

ముద్దుపళని రాధికాసాంత్వనము.. తెలుగు సాహిత్యంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు. కానీ ఎక్కువ శాతం తెలుగు పాఠకులు చదవని కావ్యం. శృంగార కావ్యం పేరుతో చదవడానికి ఇష్టపడని రచన. తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాలలో పెద్దగా ప్రాధాన్యత లేని పుస్తకం. తెలుగు అకడమిక్స్ వారు చాలా దూరంగా ఉంచిన కృతి. విశ్వవిద్యాలయాలల్లో పెద్దగా పరిశోధనకు నోచుకోని కావ్యం.

ఇప్పటి వరకు తెలుగులో చాలా అంతర్జాల సదస్సులు జరిగాయి. తెలుగు సాహిత్యంపైన తెలుగు వారందరం మనకు నచ్చిన అంశం పైన, నచ్చిన రీతిలో మాట్లాడుకున్నాం.. చర్చించకున్నాం.. తెలుగులో చర్చించాల్సిన పుస్తకాలలో ముద్దుపళని రాధికాసాంత్వనము ఒకటి..

తెలుగు కావ్యంపైన తెలుగేతరులు అకడమిక్ పద్ధతిలో చర్చిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో  “A New Dawn on Muddupalani’s Radhika Santvanamu” అనే శీర్షికతో అంతర్జాలంలో Panel discussion ఏర్పాటు చేయడం జరిగింది.

తెలుగు పరిశోధక విద్యార్థులు అకడమిక్ దృక్పథంతో ఒక రచనను ఎలా చూడాలి? అనే అంశాన్ని తెలుసుకోవడం కోసం ఈ Panel discussion ఉపయోగపడుతుందని భావించి పరిశోధక విద్యార్థులను, ఆసక్తి కలిగిన తెలుగు పాఠకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము.

Department of Modern Indian Languages and Literary Studies University of Delhi, Delhi-110007 is inviting you to a scheduled Zoom meeting.

Topic: Panel discussion on “A New Dawn on Muddupalani’s Radhika Santvanamu”

Date: Oct 13, 2020
Time:  05:30 PM India

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/9623228966?pwd=YnpwZU5rRGhaV2RFTktZYkMwRVFWZz09
Meeting ID: 962 322 8966
Passcode: telugu

నమస్కారండా. వెంకటరామయ్య గంపా
(Dr Venkata Ramaiah Gampa)
Assistant Professor of Telugu
Department of Modern Indian Languages and Literary Studies
University of Delhi
Delhi-110 007
Ph.09958607789

Leave a Reply

%d bloggers like this: