అక్టోబర్ 14, 2020

ఆహ్వానం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 8:02 సా. by వసుంధర

పరిశోధన పత్రాలకు ఆహ్వానం:

“విజయదశమి” రోజు (ఆదివారం, తేదీ. 25.10.2020) – “ఔచిత్యమ్” – పరిశోధనాత్మక తెలుగు మాసపత్రిక (Online Research Journal) మొదటి సంచికను ఔచిత్యమ్.కామ్ గా ప్రారంభించడానికి సంకల్పించాం.

ప్రామాణిక పరిశోధన పద్ధతుల్ని, విధివిధానాలను అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ఈ అంతర్జాల మాసపత్రికకు మీ పరిశోధనావ్యాసాలను పంపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. విశ్వమంతా వ్యాపించి ఉన్న తెలుగు భాషా ప్రేమికులు, పరిశోధకులు కూడా తమతమ ఆలోచనల్ని భాషాసాహిత్యవ్యాసాల రూపంలో పంచుకోగలరని ఆశిస్తున్నాం.!

MS-WORD లో – ఏదైనా తెలుగు UNICODE FONTSలో Type చేసిన పరిశోధనావ్యాసాన్ని మాత్రమే తేదీ: 20.10.2020 లోగా పంపించగలరు.

వ్యాసాలు పంపవలసిన e-mail Address : EDITOR@AUCHITHYAM.COM

సంపాదకమండలి
“ఔచిత్యమ్” – పరిశోధనాత్మక తెలుగుమాసపత్రిక.

Leave a Reply

%d bloggers like this: