అక్టోబర్ 21, 2020
కథల పోటీ ఫలితాలు – పాలపిట్ట
దసరా కథా ఉత్సవం.
దసరా రోజున పాలపిట్ట దర్శనం తెలుగువారికి ఆనందదాయకం. ఈ సందర్భాన్ని ఒక సాహిత్య ఉత్సవంగా మలచాలన్న సంకల్పంతో పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా దసరా కథల పోటీని నిర్వహించాలని తలపెట్టి రచయితలని ఆహ్వానించాయి. జూన్ ఆఖరున తీసుకున్న ఈ నిర్ణయానికి వివిధ పత్రికలు, వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపులు స్వాగతించి పదగురికి తెలియజేయడానికి సహకరించాయి. తెలుగు ప్రాంతాలవారే గాక దేశంలోని వివిధ నగరాలనించి, విదేశాలలో ఉన్నవారి నుంచి మంచి స్పందన లభించింది. దాదాపు 350 మందికి పైగా కథలు వచ్చాయి. ఈ అనూహ్యమైన స్పందన పాలపిట్టకు కొత్త అనుభవం. వస్తు శిల్పాలలో వైవిధ్యాన్ని చూపిన అనేక కథలు వచ్చాయి. ఈ పోటీలో కథల ఎంపికకు కె.పి.అశోక్‌కుమార్, వంశీకృష్ణ, సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగునాట వర్తమాన కథకుల కథనరీతులను, వారి సృజనాత్మక స్పందనలను తెలుసుకోడానికి ఈ పోటీ ఉపయోగపడింది. ఇవాళ వస్తున్న కథల తీరుతెన్నులను అవలోకించడానికి ఈ కథల పఠనానుభవం తోడ్పడింది. పేజీల పరిమితి గానీ, వస్తువులకు పరిధులు గానీ పెట్టలేదు. ఎలాంటి షరతులు లేకుండా కథకుల అభివ్యక్తి స్వేచ్ఛను గౌరవించింది పాలపిట్ట. ఈ పోటీ కోసం కథలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మున్ముందు ఇలాంటి ప్రయత్నాలకు సాహిత్యలోకం సహకరిస్తుందన్నది ఆకాంక్ష. ఎంపికయిన కథల ప్రచురణ పరంపర రాబోయే సంచిక నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికయిన కథల వివరాలు ఇక్కడ…





Leave a Reply