అక్టోబర్ 24, 2020

నవలల పోటీ ఫలితాలు – విశాలాక్షి

Posted in కథల పోటీలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 11:47 ఉద. by వసుంధర

డా. పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి మరియు విశాలాక్షి సాహితీ మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన తెలుగు నవలల పోటీలలో ప్రముఖ రచయిత
శ్రీ. సింహప్రసాద్ ( హైదరాబాద్) నవల “వెన్నెల గొడుగు” డాక్టర్ పెళ్లకూరు జయప్రద సాహితీ నవల పురస్కారాన్ని అందుకుంది.
శుక్రవారం నెల్లూరులో ఈ ఫలితాలను నిర్వాహకులు వెలువరించారు. ఈ నవల కింద వారికి 25000 రూపాయలు నగదు పురస్కారంతో పాటు సభలో సత్కారం చేయబడుతుంది .
వరుస లో …
1)పెబ్బిలి హైమావతి గారి మాతృదేవోభవ
2)వి.చెన్నయ్య (దొరవేటి) రంగారెడ్డి జిల్లా వారి పెళ్లి ఎంత కఠినం
3)కనుపూరు శ్రీనివాసులురెడ్డి గారి సంధ్యా సమయంలో
.4)నామనీ సుజనా దేవి గారి ఐ లవ్ ఇండియా నవలలు నిలిచాయి.
ఈ పోటీలకు దాదాపుగా ఇరవై నవలలు రాగా సింహప్రసాద్ గారి నవల అత్యున్నతమైన నవలగా నిర్ణయించారు . డాక్టర్ చంద్రలత శ్రీమతి వి.ప్రతిమ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు..పరిస్థితులు బట్టి త్వరలో జరుగు సదస్సులో ఈ బహుమతి అందజేయబడుతుంది .

ఈతకోట సుబ్బారావు
సంపాదకులు
విశాలాక్షి సాహిత్య మాసపత్రిక
డాక్టర్ జయప్రద సోమిరెడ్డి సాహితీ నవలా పురస్కారం కమిటీ

Leave a Reply

%d bloggers like this: