అక్టోబర్ 25, 2020

బ‌తుక‌మ్మ క‌విత‌ల పోటీ

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 2:28 సా. by వసుంధర

బ‌తుక‌మ్మ క‌వితా ఉత్స‌వం: తగుళ్ల గోపాల్ కు ప్రథమ బహుమతి
By Telugu TeamFirst Published 24, Oct 2020, 2:37 PM
HIGHLIGHTS
బ‌తుక‌మ్మ పండుగని ఒక క‌వితా ఉత్స‌వంగా మ‌ల‌చాల‌న్న సంక‌ల్పంతో కొన్నాళ్ళ కింద‌ట బ‌తుక‌మ్మ క‌విత‌ల పోటీకి పిలుపు నిచ్చింది పాల‌పిట్ట మాస‌ప‌త్రిక‌. విభిన్న పాయ‌ల‌కు చెందిన క‌వులు విశేషంగా పాల్గొన్నారు.

Telugu poetry competition: Tagulla Gopal gets first prize
తెలంగాణ సంస్కృతీ సంప్ర‌దాయాల‌కి ప్ర‌తీక‌గా నిలిచిన బ‌తుక‌మ్మ పండుగని ఒక క‌వితా ఉత్స‌వంగా మ‌ల‌చాల‌న్న సంక‌ల్పంతో కొన్నాళ్ళ కింద‌ట బ‌తుక‌మ్మ క‌విత‌ల పోటీకి పిలుపు నిచ్చింది పాల‌పిట్ట మాస‌ప‌త్రిక‌. విభిన్న పాయ‌ల‌కు చెందిన క‌వులు విశేషంగా పాల్గొన్నారు. దాదాపు మూడు వంద‌ల‌కు పైగా క‌విత‌లు వ‌చ్చాయి. వ‌ర్త‌మాన సాహిత్య ప్ర‌పంచంలో వ‌స్తున్న క‌విత్వ తీరుతెన్నుల‌ని అర్థం చేసుకోడానికి ఈ పోటీకి వ‌చ్చిన క‌విత‌ల అధ్య‌య‌నం తోడ్ప‌డింది. ఈ క‌విత‌ల్ని ప‌రిశీలించి ఎంపిక చేసేందుకు న్యాయ‌నిర్ణేత‌లుగా ప్ర‌ముఖ సాహిత్య‌కారులు విహారి, ఏనుగు న‌ర‌సింహారెడ్డి, ఎం. నారాయ‌ణ‌శ‌ర్మ వ్య‌వ‌హ‌రించారు. బ‌తుక‌మ్మ పండుగ సంద‌ర్భంగా త‌ల‌పెట్టిన ఈ పోటీకి క‌విత‌ల‌ని పంపించిన క‌వుల‌కీ, క‌విత‌ల‌ని శ్ర‌ద్ధ‌గా ప‌రిశీలించి ఎంపిక చేసిన న్యాయ నిర్ణేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. స‌ద్దుల బ‌తుక‌మ్మ సంద‌ర్భంగా ఎంపికయిన క‌విత‌ల‌, క‌వుల జాబితాని ఇక్క‌డ అందిస్తున్నాం.

ప్ర‌థ‌మ బహుమ‌తిః ఇంత‌కూ నేనెప్పుడు పుట్టాను – తగుళ్ళ గోపాల్
రెండోబ‌హుమ‌తిః ఊరు వైపు ఒక‌సారి – ఉదారి నారాయ‌ణ
మూడో బ‌హుమ‌తిః ఆశ‌కైనా – ప‌ద్మావ‌తి రాంభ‌క్త

ప్ర‌త్యేక బ‌హుమ‌తులు

 1. మూగ‌వాడు – రాధిక గ‌ట్టు
 2. పొత్తిళ్ళ స్ప‌ర్శ – ఒద్దిరాజు ప్ర‌వీణ్‌కుమార్
 3. క్ష‌మించు త‌ల్లి – ఆది ఆంధ్ర తిప్పేస్వామి
 4. క‌త్తెర కుంచె- ఈత‌కోట సుబ్బారావు
 5. ఒంట‌రి దుఃఖం – ర‌మాదేవి నెల్లుట్ల‌
 6. చెదిరిన స్వ‌ప్నాలు – గోప‌గాని ర‌వీంద‌ర్
 7. ర‌హ‌స్య లిపి – అశోక్ అవారి
 8. ఏడీ? ఏమ‌య్యాడు? – చిత్త‌లూరి స‌త్య‌నారాయ‌ణ
 9. కాలానికో లేఖ – శైల‌జామిత్ర
 10. మ‌బ్బులు క‌మ్ముకున్నాయ్ – వ‌నిపాక‌ల ల‌చ్చిరెడ్డి

సాధారణ ప్రచురణకు ఎంపికయిన కవితలు

 1. నీ పనే – దాసరి మోహన్‌
 2. నటచరామి – వేముల‌ సత్యనారాయణ
 3. అనియత – వాసుదేవ్‌
 4. ఎసర్లు పొంగించాల‌ని ఉంది – ఎం.ఎస్‌.రాజు
 5. ఎడారిపడకలు – రమేష్ న‌ల్లు
 6. బువ్వకుండ – ప్రేమ్‌ సమీర్‌
 7. సముద్రపొడ్డున దాచిన రహస్యం – నాదెళ్ళ అనురాధ
 8. మనుషు రాలే కార్తె – వ‌డ్ల‌కొండ‌ దయాకర్‌
 9. వెతుక్కుంటున్నాను – జి. రంగబాబు
 10. కానరాని మెతుకు – కమలేకర్‌ శ్యామ్‌ ప్రసాద్‌రావు
 11. కన్నీటి వరద – ల‌క్ష్మీ పద్మజ
 12. నేత్ర పర్వం – మౌనశ్రీ మల్లిక్‌
 13. మట్టిపాదాలు – జడా సుబ్బారావు
 14. సశేషం – మందరపు హైమావతి
 15. మనసు వనం – శాంతికృష్ణ
 16. పొలం కోసం కల ‌కనాలి – అమూల్య‌ చందు
 17. కీ – రాచమ‌ల్లు ఉపేందర్‌
 18. పూల‌ దు:ఖం – జవేరియా
 19. చేను గట్టు నవ్వేరోజు – మల్లారెడ్డి మురళీమోహన్‌
 20. కుదుపు – మండల‌ స్వామి
 21. నాకు నాన్న కావాలి – పుట్టి గిరిధర్‌
 22. నిరీక్షణ – ర్యాలి ప్రసాద్‌
 23. మోట బావి – రమేష్‌ నీరోజు
 24. గొప్పేమి కాదులే – అమ్జద్‌
 25. సహస్రఫణి – కరిపె రాజ్‌కుమార్‌
 26. పుస్తకం ఆత్మఘోష – కె. దివాకరాచారి
 27. బాల‌ కార్మికులు – సురేందర్‌ రొడ్డ
 28. మా ఇంటి సూర్యుడు – ఆనంద్‌ పెరుమాళ్ళ

Leave a Reply

%d bloggers like this: