నవంబర్ 7, 2020

శతక పద్యాలకు ఆహ్వానం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 10:32 ఉద. by వసుంధర

కవులకు,కవయిత్రులకు,పండితులకు విజ్ఞప్తి◆

     శ్రీ మహాగణాధిపతయే నమః
        శ్రీ గురుభ్యోనమః

త్రిభాషామహాసహస్రావధాని,బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు ఏలూరులో శ్రీప్రణవపీఠాన్ని 20 సంవత్సరాల క్రితం స్థాపించిన విషయం మీ కందరకూ తెలిసే ఉంటుంది..ఆ ప్రణవపీఠంలో శ్రీ సరస్వతీ,శ్రీ మహాలక్ష్మీసమేత”శ్రీలలితాపరాభట్టారిక”
ఆలయం ప్రధానాలయం.ఇది కాక
శ్రీ ప్రణవేశ్వరాలయం(శివాలయం) శ్రీరామాలయం, శ్రీ సాయిబాబావారి ఆలయం,
నవగ్రహాలయం మున్నగు అన్ని ఆలయాలు
ఉన్నవి.ఈ ఆలయాలతో బాటు విశామైన స్థలంలో 18 అడుగుల నర్మదాబాణమహాలింగం ప్రతిష్ఠించడానికి వీలుగా ప్రస్తుతం ఆలయనిర్మాణం జరుగుతున్నది.
ఈ లింగమునకు “సత్యధర్మేశ్వర” అనే నామం శ్రీ గురుదేవులు ఖాయం చేసారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని
“సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో ఒక శతకాన్ని సకలకవీశ్వర శతకంగావెలువరించాలని శ్రీ పద్మాకర్ గురుదేవులు సంకల్పించారు.
ఆ శతకాన్ని మైసూరులోని దత్తపీఠాధిపతి
శ్రీ శ్రీ శ్రీ గణపతిసచ్చిదానందస్వామివారు తమ దివ్యహస్తాలతో ఆవిష్కరిస్తారని శ్రీపద్మాకర్ గురుదేవులు తెలియజేసారు.సాహితీస్రష్టలైన కవులు,కవయిత్రులు, పండితులు ఈ యజ్ఞంలో పాల్గొన గోరుచున్నాము.కవులందరూ “సత్యధర్మేశ్వరా”అనే మకుటంతో పద్యాన్ని తాత్పర్యసహితంగా వ్రాసి, మీ పేరు , మీకు గల బిరుదులు, చిరునామా,
మొబైల్ నంబరుతో సహా వ్రాసి
మొబైల్ నంబరు
“98660 21103” కు వాట్సప్ లో పోస్టు చేయగలరు.
(మొబైల్ నంబరు ఈయడం కుదరదనుకొంటే
మీ చిరునామా వ్రాయగలరు)
ప్రతి పద్యం క్రింద కవిపేరు తప్పకుండా ప్రచురింపబడుతుంది.

◆గమనిక : తాత్పర్యసహితంగా మాకుచేరిన 207పద్యములవరకూ పుస్తకంలో ముద్రించగలము.
రచనలు పంపినవారికి శివలింగప్రతిష్ఠామహోత్సవ సమయంలో శతకప్రతి అందజేయబడుతుంది.

6 వ్యాఖ్యలు »

 1. మరొక మాట. నా అభిప్రాయంతో ఎందరో ఏకీభవించకపోయినా ఇబ్బంది లేదు. ఈవిషయంలో మరింతగా విస్తరించి నా శ్యామలీయం బ్లాగులో వ్రాసాను. వీలుంటే పరిశీలించండి. ఈ వ్యాఖ్యను అవసరం లేదనుకుంటే ప్రచురించ నక్కర లేదు.

  • మీ అభిప్రాయంతో ఏకీభవించనివారితో ఇబ్బంది లేదనడం మీ సంస్కారాన్ని తెలియజేస్తుంది. మనం రాజకీయవాదులం కాదు. సాహితీ అభిమానులం.
   మాకు ప్రత్యేకంగా ఈ అంశంపై ఆసక్తి లేదు. ఆసక్తి ఉన్నవారికోసం ఈ టపాని ప్రచురించాం. ఈ అంశంపై మరింత ఆసక్తి ఉన్నవారు – తప్పక మీ బ్లాగు చూస్తారన్న ఉద్దేశ్యంతో – మీ లేఖని ప్రచురిస్తున్నాం.


Leave a Reply

%d bloggers like this: