డిసెంబర్ 7, 2020
మినీకథల పోటీ – ప్రతిలిపి
లంకెః https://telugu.pratilipi.com/event/40ea8zkmg3
చిన్న ప్రపంచం పెద్ద సందేశం
“చిన్న ప్రపంచం పెద్ద సందేశం” శీర్షికతో మినీ కథల పోటీకి తెలుగు రచయితల నుండి మినీ కథలను ప్రతిలిపి ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో సీనియర్ రచయితలతో పాటు కొత్త కథకులు కూడా పెద్ద మొత్తంలో పాల్గొనాలని కోరుతున్నాము. కొత్తగా కథలు రాయాలనుకుంటున్నవారు మినీ కథలతో ప్రారంభం చేయవచ్చు. ఈ పోటీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కథకులను ఆహ్వానిస్తున్నాము.
ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-
న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-
మొదటి బహుమతి : 5000
రెండవ బహుమతి : 2500
ముఖ్యమైన తేదీలు :
1.మీ కథలు పంపడానికి చివరి తేది డిసెంబర్- 29-2020.
2.డిసెంబర్-30-2020న మీ రచనలను ప్రచురణ చేసి…ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును.
నియమాలు :-
1.ప్రతి రచయిత పదహైదు కథల వరకు సబ్మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్మిట్ చేయవచ్చు.
పోటీలో పాల్గొనే పద్ధతి :-
1.ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.
2.మీ కథలను “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి కథను పోస్ట్ చేసి అప్లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.
3.కథ యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే కథకు తగ్గ ఫోటో అప్లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు కథకు సరిపడిన ఫోటో జతచేయండి.
4.ఫోటో జత చేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “కథ”, వర్గంలో మీ కథ యొక్క వర్గం సెలెక్ట్ చేసి మీ కథను సబ్మిట్ చేయండి.
5.అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ ఇలా ఎన్ని అయినా సబ్మిట్ చేయగలరు.
న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-
మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి మీరు ఎలాంటి కథా అంశం తీసుకున్నారు, కథలోని శిల్పం, తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటిస్తారు.
సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com మొబైల్ – 7259511956 పాల్గొనండి
Leave a Reply