డిసెంబర్ 28, 2020

ధారావాహికల పోటీ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 8:29 సా. by వసుంధర

లంకె

అందరికి నమస్కారం,

10k రైటింగ్ ఛాలెంజ్ పోటీతో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. ఇచ్చిన గడువు లోపల 10,000 వేల పదాల ధారావాహికలను రాసి నగదు బహుమతులు పొందండి. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. ధారావాహిక ఏ అంశంపైన అయినా రాయవచ్చు.

బహుమతులు :

  1. మొదటి బహుమతి : 10,000
  2. రెండవ బహుమతి : 5,000
  3. పోటీలో పాల్గొని 10 వేల పదాలు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం మెయిల్ చేయబడును.

పోటీలో ఎవరు పాల్గొన వచ్చు?

పోటీలో ఎవరైనా పాల్గొన వచ్చు.

నేను ఎప్పుడూ… ధారావాహిక రాయలేదు. నేను కూడా పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. ధారావాహిక ఎలా రాయాలో…? సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.

10k రైటింగ్ ఛాలెంజ్ అంటే ఏమిటి? ఎలా పాల్గొనాలి?

ఈ పోటీలో పాల్గొనడానికి మీరు ధారావాహికను రాయవలసి ఉంటుంది. 10k రైటింగ్ ఛాలెంజ్ అంటే మీ ధారావాహిక తప్పకుండా 10,000 పదాలు ఉండాలి. ధారావాహికను ప్రచురణ చేసేటప్పుడు “10k రైటింగ్ ఛాలెంజ్” అనే వర్గం తప్పకుండా ఎంచుకోవాలి. ధారావాహిక ప్రతి రోజూ పోస్ట్ చేస్తారో, వారానికి ఒకసారి పోస్ట్ చేస్తారో, రెండు…మూడు సార్లు పోస్ట్ చేస్తారో… పూర్తిగా మీ ఇష్టం. ధారావాహిక ఎన్ని ఎపిసోడ్స్ అయినా ఉండవచ్చు. ఈ పోటీకి మీ ధారావాహికలు స్వీయ ప్రచురణ మాత్రమే చేయాలి. సబ్మిట్ బటన్ ద్వారా కాదు. 

ధారావాహిక ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి?

29.12.2020 లోపు మీ ధారావాహిక పూర్తి చేయాలి. 

పోటీలో ఎన్ని ధారావాహికాలైనా  రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

ధారావాహిక భాగాలు ఎన్ని ఉండాలి?

ధారావాహిక ఎన్ని భాగాలైనా ఉండవచ్చు. కాకపోతే అన్ని భాగాలు కలిపినప్పుడు మీ ధారావాహిక తప్పనిసరిగా 10,000 పదాలు ఉండాలి. 10,000 పదాలు దాటి ఎన్ని పదాలు రాసినా అతి మీకు ప్లస్ అవుతుంది.

విజేతల ఎంపిక ఎలా ఉంటుంది?

సుప్రసిద్ధ రచయితలు, విమర్శకుల బృందం మీరు ఎంచుకున్న వస్తువు, కథనం, శిల్పం, చక్కని వ్యాకరణం లాంటివి అనేకం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. 

ఫలితాలు ఎప్పుడు?

జనవరి. 03.2021న ఫలితాల తేదీని ఇక్కడే ప్రకటించబడును. 

కాపీ రైట్ :

ప్రతిలిపిలో ఇది వరకు ప్రచురణ అయినవి పోటీలో పెట్టరాదు. వేరే పత్రికల్లో రాసినవి సబ్‌మిట్ చేయవచ్చు. కాపీ చేసిన రచనలు పోటీకి పంపితే చట్టపరమైన చిక్కులు ఉంటాయి.

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com  

Leave a Reply

%d bloggers like this: