జనవరి 5, 2021

సిక్స్ వీక్స్ స్టోరీస్ చాలెంజ్ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 8:37 సా. by వసుంధర

లంకె

సిక్స్ వీక్స్ స్టొరీ ఛాలెంజ్

అందరికి నమస్కారం,

కొత్త సంవత్సరంలో కొత్త రైటింగ్ ఛాలెంజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? రచయితగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి అంటే… మీరు తప్పకుండా… “సిక్స్ వీక్స్ స్టోరీ ఛాలెంజ్” లో పాల్గొనండి.  ఇచ్చిన గడువు లోపు… మేము ఇచ్చిన  కథా వర్గాలకు సంబంధించిన కథలను రాయాలి.

కథా వర్గాలు :

మొదటి వారం   : ప్రేమ కథ రాయాలి (01.01.2021 నుండి 07.01.2021 లోపు)

రెండవ వారం    : సామాజిక కథ రాయాలి (08.01.2021 నుండి 14.01.2021 లోపు)

మూడవ వారం  : కుటుంబ కథ రాయాలి (15.01.2021 నుండి 21.01.2021 లోపు)

నాలుగవ వారం : సైన్స్ ఫిక్షన్ కథ రాయాలి (22.01.2021 నుండి 28.01.2021 లోపు)

ఐదవ వారం     : హిస్టారికల్ ఫిక్షన్ (29.01.2021 నుండి 05.02.2021 లోపు)

ఆరవ వారం     : మీకు నచ్చిన అంశం మీద కథ రాయాలి (06.02.2021 నుండి 12.02.2021 లోపు)

బహుమతులు :

ప్రతి వర్గంలో ఇద్దరు విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

మొదటి బహుమతి : 2000

రెండవ బహుమతి : 1000

ఇలా ఆరు వారాలకు గాను 12 మందిని విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాన్ని మెయిల్ కి పంపడం జరుగుతుంది.

పోటీలో ఎవరు పాల్గొన వచ్చు?

పోటీలో ఎవరైనా పాల్గొన వచ్చు.

“సిక్స్ వీక్స్ ఛాలెంజ్” అంటే ఏమిటి? ఎలా పాల్గొనాలి?

ఈ పోటీలో పాల్గొనడానికి మేము ఇచ్చిన వర్గాలకు సంబంధించిన కథలను మీరు రాయవలసి ఉంటుంది. మొదటి వారానికి సంబంధించిన కథను ఇచ్చిన గడువు లోపే రాయాలి. అలాగే మిగిలిన వర్గాలు కూడా. ఆరు వారాలు ఎవరైతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేస్తారో… వారే పోటీలో ఉన్నట్లు. కథల యొక్క నిడివి పూర్తిగా మీ సొంతం.

ముఖ్య గమనిక :

కథలను స్వీయ ప్రచురణ చేసేటప్పుడు తప్పకుండా “సిక్స్ వీక్స్ స్టోరీ ఛాలెంజ్” అనే వర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ప్రేమ కథను ప్రచురణ చేసేటప్పుడు ప్రేమ కథ మరియు “సిక్స్ వీక్స్ స్టోరీ ఛాలెంజ్” సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన కథలు ప్రచురణ చేసేటప్పుడు “సిక్స్ వీక్స్ స్టోరీ ఛాలెంజ్” పాటు సంబంధించిన వర్గం సెలెక్ట్ చేసుకోవాలి.

ఒకే వర్గంలో ఎన్ని కథలైన  రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఒక వర్గానికి ఎన్ని కథలైన రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి. ఒక్కో వర్గంలో ఒక్క కథ తప్పనిసరి… ఆ పైన ఎన్ని కథలైన ఉండవచ్చు.

ఆరు వారాలలో ఆరు ధారావాహికలు రాయవచ్చా?

తప్పకుండా రాయవచ్చు. మీరు కథలు రాస్తారో… ధారావాహికలు రాస్తారో అది మీ ఇష్టం.

విజేతల ఎంపిక ఎలా ఉంటుంది?

సుప్రసిద్ధ రచయితలు, విమర్శకుల బృందం మీరు ఎంచుకున్న వస్తువు, కథనం, శిల్పం, చక్కని వ్యాకరణం లాంటివి అనేకం పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు.

కాపీ రైట్ :

ప్రతిలిపిలో ఇది వరకు ప్రచురణ అయినవి పోటీలో పెట్టరాదు. వేరే పత్రికల్లో రాసినవి సబ్‌మిట్ చేయవచ్చు. కాపీ చేసిన రచనలు పోటీకి పంపితే చట్టపరమైన చిక్కులు ఉంటాయి.

Leave a Reply

%d bloggers like this: