జనవరి 8, 2021

1k స్టోరీ ఛాలెంజ్ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:13 ఉద. by వసుంధర

లంకె

1k స్టోరీ ఛాలెంజ్

కొత్త సంవత్సరం కొత్త రైటింగ్ ఛాలెంజ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ప్రతిలిపి నిర్వహించే 1k స్టోరీ రైటింగ్ ఛాలెంజ్ పాల్గొని విజేతలుగా నిలవండి. మీ కథ 1000 పదాలకు పైన ఉండాలి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

ఒకరు, ఇద్దరు కాకుండా… ఇరవై మందిని విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. ఇరవై మందికి ప్రతిలిపి నుండి చేతి గడియారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ గడియారాల లోపల ప్రతిలిపి లోగో మరియు విజేతల పేర్లను ముద్రించి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలు పంపడానికి చివరి తేది ఫిబ్రవరి-07-2021.

2. ఫిబ్రవరి-08-2021 కథలను ప్రచురించి ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును. 

నియమాలు :-

1.ప్రతి ఒక్కరూ పదహైదు కథల వరకు సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

1.ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.

2.మీ కథని “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి కథను పోస్ట్ చేసి అప్‌లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.

3.కథ యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే కథకు తగ్గ ఫోటో అప్‌లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు కథకు సరిపడిన ఫోటో జతచేయండి.

4.ఫోటో జత చేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “కథ”, వర్గంలో మీ కథ  యొక్క వర్గం సెలెక్ట్ చేసి మీ కథ సబ్‌మిట్ చేయండి.

5.అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ ఇలా ఎన్ని అయినా సబ్‌మిట్ చేయగలరు.  

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ కథ మా న్యాయనిర్ణేతలు చదివి విజేతలను ప్రకటిస్తారు.

సందేహాలకు  : మెయిల్ – telugu@pratilipi.com  పాల్గొనండి

Leave a Reply

%d bloggers like this: