జనవరి 11, 2021

కథల పోటీ – నెచ్చెలి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 4:29 సా. by వసుంధర

మహిత సాహితీ సంస్థ & నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించే “తమిరిశ జానకి కథా పురస్కారం” ఉగాది కథల పోటీ-2021కి కథలకు ఆహ్వానం-

మూడు ఉత్తమ కథలకు ఒక్కొక్కటికి రూ.1116 (వెయ్యి నూట పదహార్లు) బహుమతిగా ఇవ్వబడతాయి.

10 కథలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడతాయి.

ఎంపిక చేసిన కథలు “నెచ్చెలి”లో నెలనెలా ప్రచురింపబడతాయి.

నిబంధనలు:-

ఇతివృత్తం స్త్రీలకు సంబంధించినదై ఉండాలి.
కథపేరుతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు స్వీకరించబడవు.
కథపై ఎక్కడా రచయిత(త్రి)పేరు ఉండకూడదు. హామీపత్రంలో మాత్రమే రాయాలి.
కథలు వర్డ్ ఫైల్ లో అయిదారు పేజీలకు మించకుండా, తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
ఒక్కొక్కరు ఒక్క కథ మాత్రమే పంపాలి.
ఈ-మెయిలు మీద “మహిత & నెచ్చెలి కథల పోటీ-2020కి” అని రాసి tyjanaki@yahoo.co.in మరియు editor.neccheli@gmail.com రెండిటికీ పంపాలి.
కథలు చేరవలసిన ఆఖరుతేదీ: ఫిబ్రవరి 10, 2021. గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
పోటీ ఫలితాలు “నెచ్చెలి” ఉగాది సంచికలో వెలువడతాయి.

Leave a Reply

%d bloggers like this: