ఫిబ్రవరి 11, 2021

డైరీ-2021 పోటీః ప్రతిలిపి

Posted in ఇతర పోటీలు, సాహితీ సమాచారం at 6:42 సా. by వసుంధర

జీవితంలో ఎన్నో అంచనాలు, మరెన్నో సవాళ్లు….

గత ఏడాది ఎన్నో అనుభవాలను, బాధలను నేర్పించి వెళ్ళింది. జీవితంలో ఎన్నో సంఘటనలు, సందర్భాలు ఎదురౌతూ ఉంటాయి… వాటిని దాటుకుంటూ పోవడమే మన పని… అయితే జరిగిన సంఘటనల నుండి, చూసిన దృశ్యాల నుండి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.

ప్రతిలిపి డైరీ-2021 శీర్షికతో ఏడాది పాటు సుదీర్ఘమైన పోటీతో మీ ముందుకు వచ్చింది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలవడానికి :

మీరు ఏమి వ్రాయాలి :

 1. ఇది ఒక డైరీ లాంటిది (నాన్ ఫిక్షన్) రాయవలసి ఉంటుంది.
 2. ప్రతిలిపి డైరీ-2021 మీకు ఒక డైరీ లాంటిది. మీరు ఏమైనా రాయవచ్చు… జీవితం గురించి, చూసిన, జరిగిన సంఘటనల గురించి, మీరు అనుభవించిన, అనుభవిస్తున్న… గమనించిన ఇలా ఏదైనా రాసే సౌలభ్యం ఉన్నది.
 3. ఈ పోటీలో మీరు ప్రతి నెల పాల్గొనవచ్చు లేదా మీకు ఇష్టమైన నెలలు కూడా పాల్గొనవచ్చు… అది పూర్తిగా మీ ఇష్టం. అయితే మీరు ఏ నెలలో అయితే పాల్గొంటారో ఆ నెలలో కనీసం ఐదు రచనలను స్వీయ ప్రచురణ చేయాలి. ఒక నెలలో ఐదు కంటే ఎక్కువ రచనలను పోటీలో ఉంచవచ్చు కానీ ఐదు కంటే తక్కువ ఉండకూడదు. మీరు ఐదు లేదా అంతకంటే ఎక్కువ భాగాలను రాస్తున్నట్లు అయితే వాటిని ధారావాహిక లాగా కూడా రాయవచ్చు.
 4. ప్రతి నెల చివరి రోజు వరకు మీ రచనలను ఆ నెలకు స్వీయ ప్రచురణ చేయవచ్చు. ఫలితాలు తరువాతి నెలలో మొదటి వారంలో ఉంటాయి.

మీరు ఎలా రాయాలి? :

 1. మీ ప్రతి రచన ప్రతిలిపిలోని మీ ప్రొఫైల్ లో స్వీయ ప్రచురణ చేయవలసి ఉంటుంది. స్వీయ ప్రచురణ చేసేటప్పుడు తప్పకుండా డైరీ-2021 అనే వర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
 2. స్వీయ ప్రచురణ ఎలా చేయాలో తెలుసుకోడానికి లింక్ పై క్లిక్ చేయండి. https://youtu.be/XdQDhDmd8RM

పురస్కారాలు :

 1. ప్రతి నెల మొదటి పది ఉత్తమ రచనలకు 500/-చొప్పున నగదు బహుమతులు ఉంటాయి.
 2. ప్రతి నెల మొదటి ఇరవై మంది రచయితలకు “ఈ నెల ఉత్తమ రచయిత” పేరుతో డిజిటల్ అవార్డు పంపబడును.

విశేష పురస్కారం :

 1. మొదటి ఇద్దరికీ 2500 నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ రచనలను మరియు క్వాలిటీ రచనలను ప్రచురణ చేస్తారో వారికే నగదు బహుమతి ఉంటుంది.
 2. ఏడాది చివర్లో మొదటి ఇరవై మందికి “ప్రతిలిపి రత్న” పేరుతో డిజిటల్ సర్టిఫికేట్ మెయిల్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

 1. మీ రచనలను స్వీయ ప్రచురణ చేయడానికి ప్రతి నెల చివరి రోజు రాత్రి 12 వరకు సమయం ఉంటుంది.
 2. ఫిబ్రవరి ఫలితాలు మార్చ్ మొదటి వారంలో ఉంటాయి.

సందేహాలకు :

telugu@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: