ఫిబ్రవరి 11, 2021

నిశీ కథల పోటీ – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:35 సా. by వసుంధర

నిశీ కథల పోటీ

కలలు కనండి నిజం నిజం చేసుకోండి….

ప్రతి ఒక్కరి జీవితంలో డ్రీం వరల్డ్ ఉంటుంది. దాన్ని సుసాధ్యం చేసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విజయం, ఓటమి సంగతి పక్కన పెడితే… ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నామన్నదే ముఖ్యం… మీరు దేని గురించి తరచుగా కల కంటున్నారు? ఏ కల మీ నిద్రలో వెంటాడుతోంది? మీ జీవిత కల కావచ్చు లేదా మీకు నిద్రలో వచ్చే స్వప్నం గురించి కావచ్చు… లేదా సమాజం ఏ విధంగా ఉండాలని మీరు కల కంటున్నారు… ఇలా ఏదైనా సరే కలలు ఆధారితం చేసుకొని కథలు రాయండి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మొదటి రెండు ఉత్తమ కథలకు 2000 చొప్పున నగదు బహుమతిని ఇవ్వబడును.

పోటీలో పాల్గొన్న అందరికి ప్రతిలిపి ప్రశంసా పత్రాన్ని మెయిల్ చేయబడును.

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలు పంపడానికి చివరి తేది ఫిబ్రవరి-18-2021.

2. ఫిబ్రవరి-19-2021రచనలు ప్రచురించి ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును. 

నియమాలు :-

1.ప్రతి ఒక్కరూ పదహైదు కథల వరకు సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

1.ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.

2.మీ కథను “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి కథను పోస్ట్ చేసి అప్‌లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.

3.కథ యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే కథకు తగ్గ ఫోటో అప్‌లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు కథకు సరిపడిన ఫోటో జతచేయండి.

4.ఫోటో జత చేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “కథ”, వర్గంలో మీ కథ యొక్క వర్గం సెలెక్ట్ చేసి మీ కథను సబ్‌మిట్ చేయండి.

5.అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ ఇలా ఎన్ని అయినా సబ్‌మిట్ చేయగలరు.  

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి విజేతలను ప్రకటిస్తారు.

సందేహాలకు  : మెయిల్ – telugu@pratilipi.com  పాల్గొనండి

Leave a Reply

%d bloggers like this: