ఫిబ్రవరి 11, 2021

ఫస్ట్ క్రష్ ప్రేమ కథల పోటీ- ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:40 సా. by వసుంధర

ఫస్ట్ క్రష్

ఫిబ్రవరి నెల అనగానే గుర్తు వచ్చేది ప్రేమికుల రోజు… ప్రతి వ్యక్తి జీవితంలో ప్రేమ ఉంటుంది. కొందరి ప్రేమ సఫలం అయితే… మరికొందరి ప్రేమ విఫలం అవుతుంది. అది పక్కన పెడితే… ఫస్ట్ క్రష్ విశేషాలను కథలుగా రాసి పోటీకి సబ్‌మిట్ చేయండి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మొదటి ఇరవై రచనలకు “ప్రతిలిపి ఉత్తమ రచయిత” అవార్డు యొక్క సాఫ్ట్ కాపీ ని మెయిల్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలు పంపడానికి చివరి తేది ఫిబ్రవరి-28-2021.

2.మార్చ్-01-2021న రచనలు ప్రచురించి ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును. 

నియమాలు :-

1.ప్రతి ఒక్కరూ పదహైదు కథల వరకు సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో పాల్గొనే పద్ధతి :-

1.ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేయండి.

2.మీ కథను “ఇక్కడ రాయండి” అనే చోట మొదటి కథను పోస్ట్ చేసి అప్‌లోడ్ సింబల్ పై క్లిక్ చేయండి.

3.కథ యొక్క శీర్షిక రాసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేయగానే కథకు తగ్గ ఫోటో అప్‌లోడ్ చేయడానికి “+” సింబల్ పై క్లిక్ చేసి ప్రతిలిపి ఫోటో గ్యాలరి మీకు నచ్చిన మరియు కథకు సరిపడిన ఫోటో జతచేయండి.

4.ఫోటో జత చేసి “తరువాత” అనే బటన్ పై క్లిక్ చేసి విభాగంలో “కథ”, వర్గంలో మీ కథ యొక్క వర్గం సెలెక్ట్ చేసి మీ కథను సబ్‌మిట్ చేయండి.

5.అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ ఇలా ఎన్ని అయినా సబ్‌మిట్ చేయగలరు.  

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి విజేతలను ప్రకటిస్తారు.

సందేహాలకు  : మెయిల్ – telugu@pratilipi.com  పాల్గొనండి

Leave a Reply

%d bloggers like this: