ఫిబ్రవరి 19, 2021
గజేంద్ర మోక్షణము పద్య పఠనపు పోటీలు
బమ్మెర పోతన విరచిత భాగవతం తెలుగు వారి సాహిత్య సంపదకు మకుటం లాంటిది. క్షీరసాగర మధనం జరిపి పొందిన అమృతంతో సమానమైన కర్ణామృతం ఇది. అందులోనూ భాగవత పంచారత్నాలు గా భావించే పోతనామాత్యుల వారి ప్రణీతమైన శ్రీమద్భాగవతము నందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో గజేంద్ర మోక్షణము (అష్టమ స్కంధము) ఒకటిగా బహుళ ప్రసిద్ధి పొందినది. ఈ గజేంద్ర మోక్షణము తెలుగువారికి మిక్కిలి ప్రీతిపాత్ర మైన కథ. బహుళార్థ సాధకమైనది, మహామంత్ర పూరితమైనది. శ్రీ వాగ్దేవీ కళాపీఠము మరియు శ్రీ ప్రణవ పీఠము సంయుక్తంగా గజేంద్ర మోక్షణము పద్యపు పోటీలు ఉచితంగా అంతర్జాల మాధ్యమం ద్వారా అంతర్జాతీయంగా నిర్వహించడం అనే భగీరథ ప్రయత్నమును మొదలుపెట్టారు అని తెలియజెయ్యుటకు ఎంతో సంతోషిస్తున్నాము. మన వంతు బాధ్యతగా పదిమందికీ చేరవేద్దాం, పద్యవైభవాన్ని మరింత వ్యాప్తి చేద్దాం. తద్వారా తెలుగు వారికి, మన తరువాతి తరానికి మన సాహిత్య సంపదను విద్యానిధి గా అందించే ఈ అవకాశమును అందరం అందిపుచ్చుకుందాము.
ఏప్రిల్ 24,2021 నుండి జరుగనున్న ఈ పద్య పఠనపు పోటీలకు తప్పక అధిక సంఖ్యలో పిల్లలూ, పెద్దలు పాల్గొని అందరమూ పద్యములను నేర్చుకొని తరిద్దాం. బయటకి కనపడేది పోటీలే అయినా, మన మనసులలో గజేంద్ర మోక్షణము పారాయణ ద్వారా ఎంతో లబ్ధి పొందే సువర్ణావకాశం ఇది. మరిన్ని వివరములకు ఈ క్రింది వెబ్సైట్ లంకె ద్వారా మీ పేర్లను, పిల్లల పేర్లను మార్చి 10,2021 లోపు నమోదు చేసుకొని పోటీలలో పాల్గొనవచ్చును.
నమోదు కొరకు-
https://tinyurl.com/gmoksha
తప్పక ఆసక్తి కలవారందరికీ, పదిమందికీ ఈ విషయాన్ని తెలియజేయ ప్రార్థన.
Leave a Reply