మార్చి 2, 2021

కార్టూన్ ఎగ్జిబిషన్

Posted in చిత్రజాలం at 9:25 సా. by వసుంధర

శతాధికకార్టూనిస్టుల కార్టూన్ ల ప్రదర్శన- విజయవాడలో 21-3-2021 ఆదివారం నాడు-అందరూ ఆహ్వానితులే- ప్రవేశం ఉచితం


కార్టూనిస్టు మిత్రులకు నమస్కారం..!
విజయవాడలో 101 మంది కార్టూనిస్టు మిత్రుల కార్టూన్లతో ఓ కార్టూను ప్రదర్శన శ్రీ బాచిగారు, శ్రీ (హాస్యానందం) రాము గారి సహకారంతో 21-3-2021 ఆదివారం నాడు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది.అధిక సంఖ్యలో మన కార్టూనిస్టులు హాజరవాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు.

ఈ కార్యక్రమానికి కార్టూనిస్టుగా మీరూ హాజరవాలని కోరుకుంటున్నారు.అంటే మీరు ఆ కార్యక్రమానికి జస్ట్ హాజరయితే చాలు. అదే పదివేలు.మీరు తప్పకుండా హాజరవుతున్నట్టు తెలుపుతూ మీరేసిన మంచి కార్టూనుని ప్రదర్శనలో ఉంచడానికి ఈమెయిల్ లో 10-3-2021 తేదీలోగా sreedhar.annam@yahoo.in నకు పంపించండి.
మీ కార్టూను JPG ఫార్మాట్ లో 300 DPI లో స్కాన్ చేసి పంపాలి

ఈ శతాధిక కార్టూన్ల ఎగ్జిబిషన్ లో మీ కార్టూను ఉండాలని మేము కోరుకుంటున్నాము. కనుక మీరు గీసిన కార్టూనులలో ఒక ఉత్తమమైన కార్టూను ఒకటి ఈమెయిల్ కి పంపితే ఆరోజు మీ కార్టూనులు చక్కని A3 ఫ్రేములో ప్రదర్శించడం జరుగుతుంది. మీరు ఆరోజు విజయవాడ సందర్శించి నిర్వాహకులు ఏర్పాటుచేస్తున్న చక్కని లంచ్ ఆరగించి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆహ్లాదంగా గడుపుతారని కోరుకుంటున్నాము.

ఈ కార్యక్రమం పూర్తిగా నిర్వాహకుల ఖర్చుతో ఏర్పాటుచేయబడుతోంది.కాబట్టి ఏ కార్టూనిస్టు వద్దనుంచి ఎటువంటి రుసుమూ వసూలుచేయబడదు. కార్టూనిస్టు మిత్రులను కలుసుకునే మంచి అవకాశం.

గమనిక.. మీ కార్టూను మిస్సవకుండా ప్రదర్శనలో చోటుచేసుకోవాలంటే..మీరు తప్పకుండా హాజరవాలి.

తేది.. 21-3-2021ఆదివారం
సమయం.. ఉదయం 10గం నుండి సాయంత్రం 6-30గం వరకు (వేదిక వద్ద విందు ఏర్పాటు చేయబడినది)
వేదిక… చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం, రాఘవయ్య పార్క్ ఎదురు రోడ్డు, బందరు రోడ్డు, విజయవాడ.

sreedhar.annam@yahoo.in

Leave a Reply

%d bloggers like this: