కాలం మారుతోంది. తెలుగు భాష మనుగడకే సమస్య వచ్చిందని కొందరు కలవరపడుతున్నారు. కానీ ప్రపంచమంతటా తెలుగు వెలుగులు కనబడుతూనే ఉన్నాయి.
భాషను బ్రతికించే ముఖ్యసాధనాల్లో సాహిత్యం ఒకటి. ఆ సాహిత్యానికి మనుగడనిచ్చే అచ్చు పత్రికలు వరుసగా మూత పడుతున్నాయి. అదే సమయంలో అంతర్జాలం సాహిత్యానికి ఇస్తున్న ఊతం చెప్పుకోతగ్గది.
అమెరికానుంచి ఈ మాట, కౌముది వంటి పత్రికలు కొన్ని దశాబ్దాలుగా సాహిత్యసేవ చేస్తున్నాయి. ఇంకా సారంగ, మాలిక, తెలుగుజ్యోతి, సంచిక, అవిర్భవ వగైరా ఎన్నోపత్రికలు ఆశ్చర్యమనిపించే స్థాయి సాహితీ వేదికలు. ఇటీవలే ఆస్ట్రేలియాలో తెలుగు పలుకు మొదలైంది. అచ్చులోని పత్రికల్ని తలపించే సహరి ఒక వినూత్న ప్రయోగంగా వర్థిల్లుతోంది.
సాహిత్యంలో అత్యంత ప్రభావశీలమైన ప్రక్రియ కథ. ఆ కథకు ప్రాధాన్యమిస్తున్న కథామంజరి- ప్రస్తుతం అంతర్జాలంలో ఒక ఆదర్శప్రయోగం.- అదర్శం ఎందుకంటే, కథ అంటే అభిమానమున్న వారు, వనరులు స్వల్పమైనా, అనుసరించడానికి అనువైన, ఆచరణీయమైన ప్రయోగమిది. చక్కని కథలతో, ప్రయోజనాత్మకమైన స్పందనలతో- సాహితీపరులు వారిని ప్రోత్సహించడానికీ- సాహిత్యాభిమానులు వారిని స్ఫూర్తిగా తీసుకునేందుకు సహకరించడానికీ- ఇంతవరకూ వచ్చిన కథామంజరి సంచికలకు ఇక్కడ లంకె ఇస్తున్నాం.