మార్చి 7, 2021

కరోనా కథాసంకలనం

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 4:05 సా. by వసుంధర

చాలా నెలల క్రితం బుక్ రీడర్స్ క్లబ్ వారు సెప్తెంబర్-అక్టోబర్ 2020లోగా కరోనా అంశంపై కథల్ని ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చి- ఎంపిక చేసిన కథలతో ఒక సంకలనాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.

ఆ విషయమై ఏమైందని వారిని సంప్రదించగా వారీ విధంగా బదులిచ్చారుః

‘మొత్తం మాకు అందిన 105. కథలు రాసిన రచయిత/రచయిత్రులకు ప్రతి ఒక్కరికీ తెలియపరిచాం, వారికి మెయిల్ పెట్టి. ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు రెండు వడపోతల తర్వాత 7 కథలు ఎంపిక చేసారు. వారికీ తెలియజేసాం. వారి అంగీకారంతో ఆన్ లైన్ లో ప్రచురిస్తాం”.

మేమెరిగిన మేరకు చాలామంది రచయితలకు ఈ సమాచారం అందలేదు. అందనివారి సౌకర్యం కోసం, వారి సమాధానాన్ని ఇక్కడ పొందుపర్చాం.  

Leave a Reply

%d bloggers like this: