మార్చి 8, 2021

హాస్యకథల పోటీ రద్దు- అల

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 10:26 ఉద. by వసుంధర

అల పత్రిక దీపావళి కథల పోటీని ప్రకటించి, తర్వాత గడువు తేదీని పెంచిన విషయం అక్షరజాలం పాథకులకు విదితమే. గడువు తేదీ ముగిసి చాలా కాలం ఐనందున- అల సంపాదకులు శ్రీ మాన్ సింగ్ నాయక్ గారిని సంప్రదిస్రే వారిలా సమాధానమిచ్చారుః

‘పోటీ అయితే రద్దు అయిందని నేను అనుకుంటున్నాను.ఎందుకంటే ప్రస్తుతం పేపరే రావడం లేదు.నేను కథల పోటీ గురించి ఎన్ని సార్ అడిగిన నాకు సరైన సమాదానం దొరకలేదు.ఒక సాహితీ ఎడిటర్ గానే నా నంబర్ పోటీ ప్రకటనలో ఇచ్చారు.అంతే తప్పా కథల పోటీ నిర్వహించింది పత్రికా యాజమాన్యం వారే .నిన్న పోన్ చేస్తే సూచన ప్రాయంగా రద్దు అన్నట్టు తెలిసింది.పెద్దలు క్షమిస్తారని మనవి చేస్తూ మీ కథలు మీకు నచ్చిన విధంగా వాడుకోవచ్చని తెలియపరుస్తున్నాను సర్ .వీలైతే ఈ విషయం మీకు తెలిసిన రైటర్స్ కు చేరవేయండి ప్లీజ్’

పోటీని రద్దు చేసే హక్కు నిర్వాహకులకు ఉన్నట్లు ప్రకటనలోనే తెలియబర్చారు కాబట్టి, వారి నిర్ణయం నిరసించతగినది కాదు. అడిగిన వెంటనే తనకు తెలిసిన సమాచారాన్ని మర్యాదపూర్వకంగా అందజేసిన శ్రీ నాయక్ గారికి అభినందనలు.

Leave a Reply

%d bloggers like this: