మార్చి 16, 2021

కథలు, కవితల పోటీ- తెలుగువన్.కామ్

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం at 8:08 ఉద. by వసుంధర

గత రెండు దశాబ్దాలుగా ఎంతోమంది సాహితీవేత్తలను పాఠకలోకానికి పరిచయం చేసిన ఘనత తెలుగువన్.కామ్ కి దక్కింది. ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదిక పైకి తీసుకు వచ్చేందుకు తెలుగువన్ నిర్విరామంగా కృషి చేస్తుంది.

ఈ నేపథ్యంలో
ప్లవ నామ ఉగాది సందర్భంగా కథ, కవిత అంశాలలో మహిళా కవులకు పోటీలు నిర్వహిస్తున్నారు.
తెలుగువన్ మరియు అక్షరయాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
ఈ పోటీలకు సందేశాత్మకంగా, హాస్యరస ప్రధానంగా ఉండే కథలు, కవితలు పంపించ కోరుచున్నారు.

ఉత్తమ రచనలకు నగదు బహుమతి ప్రధానం చేయబడును.

కథలు
మొదటి బహుమతి – 10,116/-
రెండవ బహుమతి×2 -3116/-
మూడో బహుమతి×3-1116/-

కవితలు
మొదటి బహుమతి -5116/-
రెండవ బహుమతి×2-2116/-
మూడో బహుమతి×3-1116/-

▫️అక్షర దోషాలు లేకుండా యూనికోడ్ లో మాత్రమే మీ రచనలు పంపవలెను.
▫️హామీపత్రం తప్పనిసరిగా జతపరచవలెను.
▫️అనువాద, అనుకరణ..లేదా ఇంతకుముందు ఎక్కడైనా ప్రచురితమైన రచనలు అంగీకరించబడవు.
▫️అంశము, నిడివిపైన ఎలాంటి ఆంక్షలూ లేవు.
▫️మీ రచనలు మార్చి 30 లోగా content@teluguone.com
కు మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: