మార్చి 27, 2021

ఉగాది బాలల కథల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 10:36 ఉద. by వసుంధర

ఉగాది బాలల కథల పోటీ ఫలితాలు విడుదల.
బాలలలో సాహిత్యాభిరుచిని పెంపొందించడానికి , వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడానికి   సుగుణ సాహితి సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన  జిల్లా స్థాయి ఉగాది బాలల కథల పోటీలు -2021 ఫలితాలను  సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య సిద్ధిపేట లో శుక్ర వారం రోజున ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 104 కథలు రాగా ,కథల పోటీకి న్యాయనిర్ణేతగా ప్రముఖ బాలసాహితీవేత్త , పరిశోధకులు డా || అమ్మిన శ్రీనివాసరాజు వ్యవహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణా రెడ్డి  సౌజన్యంతో ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించనున్న సమావేశంలో విజేతలైన బాల కథకులకు బహుమతి ప్రధానోత్సవము ఉంటుందని కన్వీనర్ తెలిపారు. బహుమతి పొందిన కథల వివరాలు : ప్రథమ బహుమతి ( 1500 / – నగదు ) : చదువుల సరస్వతి పి . శృతి ( జి.ప . ఉ .పా . లక్ష్మి దేవిపల్లి ) , ద్వితీయ బహుమతి ( 1000 / – నగదు ) : ఆదర్శం ఇ . నరేష్ ( జి . ప.ఉ.పా . ( బాలికలు ) కొండపాక ) ,తృతీయ బహుమతులు ( 500 / – నగదు ) : 1. ప్రోత్సాహం ఎ.మనూష ( జి . ప . ఉ.పా . లక్ష్మి దేవిపల్లి ) 2. ఆదర్శవంతుడు బి . అజయ్ ( జి.ప . ఉ.పా. లక్ష్మి దేవిపల్లి ) ప్రోత్సాహక బహుమతులు  9.( 300 / – నగదు ) : 1. నమ్మక ద్రోహం, బి . మౌనిక ( జి.ప . ఉ.పా . ముస్యాల ) 2.  లక్ష్యం  ,ఇ.స్వామి  జి.ప. ఉ.పా . బాలికలు , కొండపాక ), 3. మంచి మనస్సు వి . రుచిత ( జి.ప . ఉ .పా . సికింద్రాపూర్ ) ,4. స్నేహం విలువ ఎమ్ . ప్రసన్న ( జి.ప. ఉ.పా . జక్కాపూర్ ) 5.పదును:  ఇ . వైష్ణవి (జి.ప . ఉ . పా. ఇందిరానగర్ ) ,6. వ్యర్థాలతో ఎరువు డి . సాయిరాం (జి.ప . ఉ . పా . లక్ష్మి దేవిపల్లి ), 7.సోమయ్య వేప చెట్టు: ఆర్ . నిఖిత ( జి . ప . ఉ . పా . వర్గల్ ) ,8. పుట్టిన రోజు బహుమతి : ఎమ్ . రాజు ( జి.ప . ఉ .పా . నర్సాయ పల్లి ) 9. చెట్ల పిచ్చోడు  :వై . రేవంత్ ( శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సిద్దిపేట ).

Leave a Reply

%d bloggers like this: