ఏప్రిల్ 1, 2021

పడతీ ఎవరు నీవు?- కథామాలిక 2021 ఫలితాలు

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:50 ఉద. by వసుంధర

అభినందనలు… శుభాకాంక్షలు…

శ్రీ సత్యనారాయణ, శారదా మెమోరియల్ ట్రస్ట్ , మాలిక పత్రిక సంయుక్త నిర్వహణలో “పడతీ! ఎవరు నీవు?” శీర్షికన కథల పోటి ప్రకటింపబడింది. ఈ పోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. వందకు పైగా కథలు వచ్చాయి. వీటిని నిర్వాహకులు ముందుగా వడపోసి న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది. కథల్లాంటి వ్యాసాలు కొన్ని, అర్ధంకాని కథలు కొన్ని, మేము ఇచ్చిన నిబంధనలు అచ్చుతప్పులు, పదాల సంఖ్యను పాటించని చాలా కథలను పక్కన పెట్టడం జరిగింది.

ఒక పోటికి తమ రచనలు పంపేవారు భాష, వ్యాకరణ దోషాలు, పదాల సంఖ్య మొదలైనవి కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని పంపించాలి. మీ కథ ఎంత బావున్నా ఇటువంటి దోషాల మూలంగా తిరస్కరింపబడతాయి అని గమనించుకోండి..

ముందుగా మేము ఉత్తమమైన 25 కథలను పుస్తకంగా అచ్చువేయాలి, రచయితలకు తలా రెండు కాపీలు ఇవ్వాలని అనుకున్నాము. కాని ఉత్తమమేమోగాని , చాలా మంచి కథలు ఎక్కువ రాలేదు. అందుకే పుస్తక ప్రచురణ వద్దనుకుని అయిదుగురికి మొదటిబహుమతిగా ఒక్కొక్కరికి రూ.1000 , ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.500 రెండవ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము.

రాసి పెరుగుతున్నకొద్దీ వాసి తగ్గుతున్నదేమో అనిపించింది. రాయడం వస్తే చాలదు.. కరెక్టుగా రాయాలి.. ఫేస్‌బుక్, వాట్సాప్ రాతలకు వచ్చే వాహ్వాలు, లైకులు, కామెంట్లు మంచి రచనలకు కొలమానాలు కావు. స్కూళ్లో నేర్చుకున్న తెలుగుపాఠాలు గుర్తుచేసుకుని, మీ రచనలకు మెరుగులు దిద్దుకోవాలని మా తరఫున చిన్న సలహా..

రెండవ బహుమతి పొందినవారు:

1. అలనాటి వాల్జడ… మంథా సీతా శర్మ

2. కాలింగ్ బెల్… ఉగాది వసంత

3. ఎవరూ రాకపోయినా సరే… లలితా వర్మ

4. ఇంకా ఎందుకీ నిశ్శబ్దం? స్ఫూర్తి కందివనం

5. మణిదీపం… శ్రీనివాసరావు శింగరాజు

6. నేను సాధించాను…. జి. స్వాతి

7. పడతి, ఎవరు నీవు?… విశాలి పేరి

ఈ కథలపోటీలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు..

విజేతలకు అభినందనలు..

త్వరలో మీ బహుమతి సొమ్ము మీకు అందజేయబడుతుంది.

ఈ 12 బహుమతి కథలతో అచ్చు పుస్తకం కాకున్నా ఈ పుస్తకంగా అతి త్వరలో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తాం.

బహుమతి రానివారు మీ కథలు తిరిగి తీసుకుని వేరే పత్రికలకు పంపుకోవచ్చు.

నిర్వాహకులు:

ఉమాభారతి

మంథా భానుమతి

జ్యోతి వలబోజు

Leave a Reply

%d bloggers like this: