ఏప్రిల్ 2, 2021

అరసం యువ కథాపురస్కారం 2021

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 8:39 సా. by kailash

అరసం యువ కథాపురస్కారం 2021
అంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర దినపత్రిక సంయుక్తంగా యువ రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో అరసం యువ కథాపురస్కారం 2021 నిర్వహిస్తున్నట్లు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో బూజుపట్టిన భావాలపై యువ కలాలు, గళాలు ధ్వజమెత్తవలసిన సమయం ఆసన్నమైంది. ఆదిశలో యువకథారచయితలను ప్రోత్సహించడం కోసం ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. 35 సంవత్సరాల లోపు వయస్సున్న కథకులు ఈ పోటీలో పాల్గొనవచ్చని, వర్తమాన సమాజాన్ని సామాజిక ఘర్షణలు, మానవ సంబంధాలను ప్రతిబింబించే, సరళమైన భాషలో రచించినకథలు పంపాలని కోరారు. స్త్రీలు, దళితులు,ఇతరశ్రామికులు, మైనార్టీల మనోభావాలను కించపరిచే విధంగా ఉండరాదని, చేతిరాతలో 8 పేజీలు, డి.టి.పి.లో 4 పేజీలు మించని కథలను ఈరచన తమ స్వంతమని, దేనికీ అనుసరణ, అనువాదం కాదనే స్వీయ ధ్రువీకరణ పత్రం జతచేసి, ఈ నెల 15వ తేదీలోగా పంపాలన్నారు.
పోటీలలో గెలుపొందిన కథలకు మొదటి బహుమతిగా రూ.2500, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయ బహుమతిగా రూ.1000, రెండు ప్రోత్సాహక బహుమతులు రూ.500 చొప్పున అందజేస్తారు.
కథలను అరసం యువ కథా పురస్కారం 2021 అని రాసిన కవర్ లో పెట్టి, ఏప్రిల్ 15వ తేదీలోగా దిగువ చిరునామాకు పంపాలి.
వల్లూరు శివప్రసాద్
అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
101, బృందావన్ కాలనీ,
7వ లైన్, ఎస్.వి.ఎన్. కాలనీ
గుంటూరు – 522006
సెల్ నెంబరు: 9291530714

Leave a Reply

%d bloggers like this: