ఏప్రిల్ 3, 2021
చంద్రమోహన్ స్మారక పురస్కారాలు
వసుంధర విజ్ఞాన వికాస మండలి
సామాజిక యువచైతన్య వేదిక
రి.నెం-4393-96
8ఇంక్లయిన్‌కాలనీ, గోదావరిఖని
పెద్దపల్లి జిల్లా ,తెలంగాణరాష్ట్రం
చంద్రమోహన్ స్మారక పురస్కారాలు
గత ఆరేండ్లుగా విద్యారంగంలో కృషిచేస్తున్న వారికి ఇస్తున్న బామండ్లపల్లి చంద్రమోహన్ స్మారక పురస్కారాలను రెండు సంవత్సరాలకు గాను ప్రకటిస్తున్నాము. గతేడాది కరోనా మూలంగా ఇవ్వలేకపోయిన పురస్కారంతో పాటు ఈ ఏడాది పురస్కారం కూడా ప్రకటిస్తున్నాం.
విద్యారంగంలో సమూల మార్పులు, విద్యార్థుల్లో విద్యా నైపుణ్యత పెంపుదలకు కృషిచేస్తున్న వారికి ఈ పురస్కారాలను అందిస్తున్నాము. కాగా 2020 సంవత్సరానికి గాను స్నేహలత ఉపాధ్యాయురాలు (కల్వచర్ల, ప్రభుత్వపాఠశాల), కె. మాధూరి ఉపాధ్యాయురాలు (బాలికోన్నత పాఠశాల, గోదావరిఖని)లకు సంయుక్తంగా పురస్కారాన్ని అందించనున్నాము. 2021 సంవత్సరానికి గాను అన్నవరం శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, వేగురుపల్లి మానకోండూరును ఎంపిక చేయడం జరిగింది. త్వరలోనే ఈ పురస్కారాల తేదిని ప్రకటిస్తాము.
మధుకర్ వైద్యుల, వ్యవస్థాపకులు, చదువువెంకటరెడ్డి అధ్యక్షులు, కట్కూరిశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్, భూమయ్య, ప్ర.కార్యదర్శి, మందల రవిందర్‌రెడ్డి.
Leave a Reply