ఏప్రిల్ 3, 2021
బాలల కవితల పోటీ ఫలితాలు: వసుంధర విజ్ఞాన వికాస మండలి
వసుంధర విజ్ఞాన వికాస మండలి
(సామాజిక యువ చైతన్య వేదిక)
స్థాపితం-1993. రినెం-4393-96
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా-తెలంగాణ రాష్ర్టం
గత 28 ఏండ్లుగా వివిధ ఆంశాలపై నిర్వహిస్తున్న సాహిత్య, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ధన్యవాదాలు. ఈ క్రమంలో కరోనా చదువులు అనే అంశంపై పాఠశాల స్థాయి విద్యార్థులకు రాష్ర్ట స్థాయిలో నిర్వహించిన కవితల పోటీకి అనుహ్య స్పందన వచ్చింది. కాగా మేము ప్రకటించినట్టు పోటీకి వచ్చిన కవితల్లో ఐదు ఉత్తమ కవితలను మా న్యాయ నిర్ణేతలు నిర్ణయించారు. వీరికి ఐదు సమాన బహుమతులు త్వరలోనే అందజేస్తాము.
విజేతల వివరాలు
1.ఈదులకంటి నందిని- పదవతరగతి, పివీ రంగారావు టీఎస్సార్ స్కూల్ -వంగర (వరంగల్ రూరల్)
2. గంటా పౌలినా ఏంజిలిన్- 7వతరగతి, సెంట్ ఆన్స్‌స్కూల్ ,భీమవరం, పశ్చీమగోదావరి జిల్లా ( ఆంధ్రప్రదేశ్)
3.ఎన్. రోహిణీ, 9వ తరగతి, జిల్లాపరిషత్ స్కూల్, కొండపాక, సిద్దిపేట జిల్లా
4. ఆదివైష్ణవి, పదవతరగతి, జిల్లా పరిషత్ స్కూల్, తడపాకల్, ఏర్గట్ల , నిజామాబాద్ జిల్లా
5. పి.నవనీత, 9వతరగతి, జిల్లా పరిషత్ స్కూల్, దేవరకద్ర, మహాబూబ్‌నగర్ జిల్లా
మధుకర్ వైద్యుల, వ్యవస్థాపకులు, చదువు వెంకటరెడ్డి అధ్యక్షులు, కట్కూరి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్,
మందల రవిందర్‌రెడ్డి, శాశ్వత ఆహ్వానితులు భూమయ్య ప్రధానకార్యదర్శి
Leave a Reply