ఏప్రిల్ 10, 2021

ఉగాది మహోత్సవం పండుగ కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 1:24 సా. by వసుంధర

ఉగాది మహోత్సవం

ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుంది. పండుగలో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. ఎన్నో తెలుగు పండుగలు మనిషి జీవన విధానానికి ప్రేరకాలుగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. ప్రతిలిపి ఉగాది మహోత్సవం పేరుతో పండుగ కథలను ఆహ్వానిస్తోంది. పండుగ కథలు అంటే ఉగాది కథలు మాత్రమే కాదు… ఏ పండుగ కథలైన రాయవచ్చు.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధంగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

  • మొదటి 10 మంది రచయితలకు “ప్రతిలిపి ఉత్తమ రచయిత” అవార్డు యొక్క సాఫ్ట్ కాపీ ని మెయిల్ చేయడం జరుగుతుంది.
  • పోటీకి వచ్చిన అన్నీ రచనలను ప్రతిలిపిలో కొత్త విభాగంగా చేర్చడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలను స్వీయ ప్రచురణ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్.29.2021

2. ఏప్రిల్.30.2021ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును.

పోటీలో ఎవరైనా పాల్గొన వచ్చా?

అవును. తప్పకుండా ఎవరైనా పాల్గొనవచ్చు.

పోటీలో ఎలా పాల్గొనాలి, ఏమి రాయాలి?

కథలు ఏ వర్గానికి సంబంధించినది అయినా ఉండవచ్చు. ఉదాహరణకు ప్రేమ, సామాజికం, ప్రేరణ, సస్పెన్స్ ఇలా ఏదైనా సరే… కథలో పండుగ వాతావరణం ఉంటే చాలు. ఉగాది అంటే కేవలం ఉగాది కథలు మాత్రమే కాదు… ప్రపంచంలో జరిగే అన్ని పండుగలను మీ కథల్లో రాయవచ్చు. ఏ మతానికి సంబంధించిన కథలైన రాయవచ్చు. కథలు సమాజాన్ని విచ్చిన్నం చేసేలా, మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదు. పోటీకి మీ కథలను ప్రతిలిపిలోని… మీ ప్రొఫైల్ లో స్వీయ ప్రచురణ చేయాలి. స్వీయ ప్రచురణ చేసేటప్పుడు తప్పకుండా “పండుగ” అనే వర్గాన్ని సెలెక్ట్ చేయాలి. పండుగ అనే వర్గం కథా అనే విభాగంలో ఉంటుంది గమనించగలరు.

సందేహాలకు :

telugupratilipi.certificates@gmail.com కి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: