ఏప్రిల్ 14, 2021

ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 5:59 సా. by వసుంధర

“డా. సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం” మరియు “సాహితీకిరణం” మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా
🖋️ “ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం” 🖋️ నిర్వహించబోతున్నాము..

తేదీ: 23,24,25 April-

🌿 దేశ విదేశాల్లోని మహిళా కవయిత్రులు అందరూ పాల్గొని తమ కవితలు వినిపిస్తారు.

🌼 కవితా వస్తువు ఉగాది గురించి కానీ లేక ఏ ఇతర శుభప్రదమైన సామాజిక అంశం గురించి కానీ ఉండవచ్చును. (కరోనా సాహిత్యం గాని, ఏ ఒక్క మతాన్ని లేక వర్గాన్ని కించపరిచే ఇతివృత్తం గానీ ఉండరాదు)

🌺 కవిత నిడివి మూడు నిమిషాలకు మించరాదు.

🥭ద్వారకామాయి సాయిబాబా పీఠం మీర్ పేట్, హైదరాబాద్; పీఠాధిపతులు పూజ్యశ్రీ గోపాలకృష్ణానంద స్వామీజి వారు తమ ఆశీస్సులను అందిస్తారు. (ప్రధమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వంశములో 34వ తరమువారు)

🌸 ప్రముఖ రచయిత్రి ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారిచే “పంచాంగ పఠనం”

🖋️ ఎంపిక చేయబడిన కవితలు సాహితీకిరణం మాస పత్రికలో ప్రచురింపబడును మరియు కవయిత్రుల అందరికీ ధ్రువపత్రాలు అందజేయబడును.

🎋 కవయిత్రి పేరు, ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి మరియు ఫోటోగ్రాఫ్ మాకు వెంటనే పంపగలరు.

🥭 విదేశీయులకు వారి దేశకాలమానాలకు అనువైన సమయం కేటాయించబడును.

  • శిరోమణి వంశీ రామరాజు,
    వ్యవస్థాపకులు, వంశీ.. Hyderabad-
    India
    Ph no 9849023852
    Waatsup no

Leave a Reply

%d bloggers like this: