ఏప్రిల్ 16, 2021

భువినుండి దివికి

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 3:07 సా. by వసుంధర

లంకె

మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా ఇక లేరు!
ప్రముఖ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ‘వార్త’ దిన పత్రిక సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా, ‘హాసం’ పక్ష పత్రిక సంపాదకుడిగా సినిమా రంగానికి ఎంతో సేవ చేశారు. ‘మా’ టీవీ ఛానెల్ లోనూ పలు సినీ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. మరీ ముఖ్యంగా సినీ సంగీత, సాహిత్యం విషయంలో ఆయనో ఎన్ సైక్లోపిడియా! ‘మ్యూజికాలజిస్ట్’ అని సినీ సంగీత కళాకారులు ఆయన్ని అభిమానంతో పిలుచుకునే వారు. అత్యంత పాఠకాదరణ పొందిన ‘ఆపాతమధురం’ శీర్షికను నిర్వహించిన శ్రీ రాజాగారు దానిని పుస్తకం రూపంలోనూ తీసుకొచ్చారు. శ్రీ రాజాగారూ కన్నుమూయడం, తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. వారకి కన్నీటి నివాళులు

Leave a Reply

%d bloggers like this: