ఏప్రిల్ 21, 2021

జాతీయ కథల పోటీ 2021ః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:09 సా. by వసుంధర

లంకె

కథా మహోత్సవం-2021

ప్రతిలిపి పాఠకులందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ప్రతిలిపి జాతీయ కథల పోటీ “కథా మహోత్సవం-2021” శీర్షికతో మీ ముందుకు వచ్చింది. ఈ పోటీలో ఎన్ని కథలైన, ఏ వర్గానికి చెందిన కథలైన కేవలం రచయితలు మాత్రమే కాకుండా ఎవరైనా  పాల్గొనవచ్చు. అధిక సంఖ్యలో పాల్గొని కథ యొక్క సత్తా చాటాలని కోరుతున్నాము. 

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:

మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి మీరు ఎలాంటి  కథాంశం తీసుకున్నారు, కథలో శిల్పం, తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

బహుమతులు :

మొదటి బహుమతి : 3000

రెండవ బహుమతి :2000

మూడవ బహుమతి : 1000

ముఖ్యమైన తేదీలు :

1.మీ రచనలు స్వీయ ప్రచురణ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్.30.2021

2. 1 మే, 2021 ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును.

నియమాలు :-

1.ప్రతి రచయిత ఎన్ని కథలైన సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2.ఇంతకముందు ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ” ప్రచురణమైనవి సబ్‌మిట్ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

కథలో ఏమి రాయాలి?

కథ యొక్క అంశం మొత్తం మీ ఇష్టం.మీరు ఎలాంటి కథ అయినా రాయవచ్చు.పదపరిమితి లేదు.ఎన్ని కథలైనా రాయవచ్చు.

కొత్త రచయితలు కూడా పాల్గొనవచ్చా?

అవును,తప్పకుండా.

స్వీయ ప్రచురణ ఎలా చేయాలి? 

1.ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “రాయండి” బటన్ పై క్లిక్ చేయండి.

2.కొత్త రచనను జోడించండి 

3.శీర్షిక రాయండి.అలాగే మీ రచనను రాయండి .

4.తరువాత “ప్రచురించండి”అనే బటన్ పైన క్లిక్ చేయండి.

5.ఫొటొ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని మీ కథకు తగ్గ ఫొటొని జోడించండి.

6.విభాగం :కథ సెలెక్ట్ చేసుకోవాలి.

7.వర్గం”జాతీయ కథలు”సెలెక్ట్ చేయాలి.

8.నేను అంగీకరిస్తున్నాను.అని సెలెక్ట్ చేసి చివరగా ప్రచురించండి..

5.అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ ఇలా ఎన్ని అయినా సబ్‌మిట్ చేయగలరు.  

 కాపీ రైట్ :

ప్రతిలిపి లో ఇది వరకు ప్రచురణ అయినవి పోటీలో పెట్టరాదు. వేరే పత్రికల్లో రాసినవి,వేరే ఎక్కడైనా బహుమతి పొందినవి లేదా మీ కథలు పుస్తకం రూపంలో ప్రచురించినవి   పోటీకి పంపవచ్చు.

సందేహాలకు  : మెయిల్ – telugu@pratilipi.com  

Leave a Reply

%d bloggers like this: