ఏప్రిల్ 21, 2021

లాక్ డౌన్ కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:12 సా. by వసుంధర

లంకె

కరోనా ఒక మహమ్మారి. కరోనా విస్తరించడం వల్ల మన ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కొంతమంది అయిన వాళ్ళని పోగొట్టుకున్నారు. కొంత మంది అనారోగ్య కారణాలతో బాధపడ్డారు. మరికొంత మంది తల్లితండ్రుల దగ్గరే ఉండి ఆనందంగా గడిపారు. ఇంకొంత మంది అయితే బంధుమిత్రుల ఇళ్లలోనే గడిపారు.ఆర్థిక సహాయం కోసం కొంత మంది ఎదురు చూస్తే, నిత్యావసర వస్తువులను పంచుతూ కొంతమంది మానవతావాదులు తమ ఔదార్యం చాటుకున్నారు.అంటే సుఖ దుఃఖాలు మనతో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ వలన  కొంత మంది తమ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తే, కొంత మంది ఆర్థికంగా చితికిపోతున్నందుకు బాధపడ్డారు.అయితే మీరు మీ లాక్ డౌన్ లైఫ్ ని ఎలా గడిపారో  మీ అనుభవాలను లేదా మీరు చూసిన సంఘటనలను కథగా రాసి ప్రతిలిపి “లాక్ డౌన్ ” కథల పోటీలో స్వీయప్రచురణ చేయండి.. మీ అనుభవాలను ప్రతిలిపి పాఠకులతో పంచుకోండి.

మీ కథలను స్వీయప్రచురణ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధంగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

మొదటి నాలుగు ఉత్తమ కథలకు 1000 చొప్పున నగదు బహుమతి ఇవ్వబడును.

మొదటి పది ఉత్తమ కథలకు ప్రతిలిపి ప్రశంసా పత్రాన్ని మెయిల్ చేయబడును.

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలు ప్రచురించడానికి చివరి తేది ఏప్రిల్ ‌‌- 30-2021.

2.మే-1-2021న రచనలు ప్రచురించి ఫలితాలు ప్రకటించే తేదీని ప్రకటించబడును. 

నియమాలు :-

1మీరు ఎన్ని కథలైనా  సబ్‌మిట్ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి సబ్‌మిట్ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి సబ్‌మిట్ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో  ఏమి రాయాలి?

మీరు చూసిన, మీకు జరిగిన, లేదా భవిష్యత్తును ఊహించుకుని కథ రాయవచ్చు.

సందేహాలకు :

telugu@pratilipi.com కి మెయిల్ చేయగలరు

Leave a Reply

%d bloggers like this: