ఏప్రిల్ 29, 2021

జై కిసాన్ కథల పోటీలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 1:01 సా. by వసుంధర

లంకె

దేశానికి అన్నం పెట్టే వ్యక్తి రైతు.మన భారతదేశ రైతుకు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అందుకే రైతును జై కిసాన్ అని పిలుస్తారు.రైతు రాత్రి పగలు కష్టపడి పంటలు పండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు.పంటలు పండించేవారినే కాకుండా కోళ్లు , పశువులు , చేపలు ,తేనెటీగలు,సిల్క్ పురుగులను పెంచే వారు కూడా రైతులే.రైతు ధాన్యాన్నే కాకుండా పాలు కూడా ఉత్పత్తి చేస్తాడు.దేశానికి అన్నం పెడతాడు.కాబట్టి రైతును దేశానికి వెన్నెముక అంటారు.అంతే కాకుండా రైతే రాజు అని కూడా అంటారు. రైతుకు సంబంధించిన కథలను రాసి మీ ప్రొఫైల్ లో స్వీయప్రచురణ చేయండి.ప్రతిలిపి జైకిసాన్ అనే శీర్షికతో మీ ముందుకు వచ్చింది.అధిక సంఖ్యలో పోటీలో పాల్గొని రైతుల మీద ఉన్న అభిమానాన్ని చాటాలని కోరుతున్నాము. 

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధంగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

మొదటి రెండు ఉత్తమ కథలకు 1500 చొప్పున నగదు బహుమతి ఇవ్వబడును.

మొదటి పది ఉత్తమ కథలకు ప్రతిలిపి ప్రశంసా పత్రాన్ని మెయిల్ చేయబడును.

ముఖ్యమైన తేదీలు :

1.మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది మే-2-2021.

2.మే-4-2021న ఫలితాలు ప్రకటించబడును. 

నియమాలు :-

1మీరు ఎన్ని కథలైనా స్వీయప్రచురణ చేయవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.

2. గతంలో ప్రతిలిపిలో ప్రచురింపబడిన మీ కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయినవి స్వీయప్రచురణ చేయవచ్చు.

3.సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

పోటీలో  ఏమి రాయాలి?

రైతుకు సంబంధించిన కథ రాయాలి.మీరు ఎలాంటి కథ అయిన రాయవచ్చు.కథలో రైతు భాగమైతే చాలు.

స్వీయప్రచురణ ఎలా చేయాలి?

ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “వ్రాయండి” బటన్ పై క్లిక్ చేయండి. కొత్త కథను జోడించి శీర్షిక రాయండి. అలాగే మీ కథను రాయండి. తరువాత”ప్రచురించండి”అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఫోటో గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని మీ కథకు తగ్గ ఫోటోని జోడించండి.విభాగం:కథ సెలెక్ట్ చేసుకోవాలి.వర్గం”రైతుకథలు”సెలెక్ట్ చేయాలి.నేను అంగీకరిస్తున్నాను అని సెలెక్ట్ చేసి చివరగా ప్రచురించండి.అలాగే మీ రెండవ కథ, మూడవ కథ, నాలుగవ కథ, ఐదవ కథ ఇలా ఎన్ని అయినా స్వీయప్రచురణ చేయగలరు.  

కాపీ రైట్ :

ప్రతిలిపిలో ఇదివరకు ప్రచురణ అయినవి పోటీలో పెట్టరాదు. వేరే పత్రికల్లో రాసినవి,వేరే ఎక్కడైనా బహుమతి పొందినవి,పొందనివి కూడా ప్రచురించవచ్చు.మరియు కథలు పుస్తకం రూపంలో ప్రచురించినవి పోటీకి ప్రచురించవచ్చు.

సందేహాలకు  : మెయిల్ -telugupratilipi.certificates@gmail.com

Leave a Reply

%d bloggers like this: