మే 4, 2021

అమ్మ కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:45 ఉద. by వసుంధర

మాతృదేవోభవ

తల్లి లేకపోతే సృష్టి లేదు. సమస్త సృష్టి కార్యానికి తల్లే కారణం. అలాంటి తల్లి గొప్పదనాన్ని, త్యాగాన్ని వివరిస్తూ కానీ… అక్క, చెల్లి, భార్య ఇలా అనేక దశలను దాటి తల్లి హోదాలో అడుగుపెట్టిన తల్లుల సమస్యలను, సకల గుణాలను మేళవిస్తూ కానీ… వృద్ధ తల్లిదండ్రులను రోడ్డున పడేయడం, ఆస్తి కోసం పిల్లలు తల్లిని చంపడం లాంటి అరాచకాల గురించి కానీ… తల్లిలో మీరు చూసిన ప్రత్యేక కోణాన్ని తీసుకొని మాతృదేవోభవ కథల పోటీకి మీ కథలను స్వీయ ప్రచురణ చేయండి. మాతృ దినోత్సవం సందర్భంగా మేము నిర్వహిస్తున్న కథల పోటీ కోసం అమ్మపై కథలను రాసి మీ తల్లి గారికి ఆ కథలను అంకితం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొనాలని కోరుకుంటున్నాము.

మరింత సమాచారం కోసం:

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి.శీర్షిక రాసి సంగ్రామం రాసి రచనను కొనసాగించి ప్రచురించండి.ఫోటోగ్యాలరీ లో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం కథ సెలెక్ట్ చేసి,వర్గం అమ్మ సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి.

సంగ్రామం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారంశం  మూడు వాక్యాలలో రాయాలి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధంగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

1. మొదటి రెండు అత్యుత్తమ కథలను మా ప్రతిలిపి బృందం చదివి ఆడియోను ప్రతిలిపి ఎఫ్.ఎం(F.M)లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది.

2. మొదటి పది ఉత్తమ కథలకు డిజిటల్ సర్టిఫికేట్ పంపడం జరుగుతుంది.

 ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 3.మే.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.మే.2021

౩. ఫలితాలు ప్రకటించే తేది : 31.మే.2021.

 నియమాలు :-

1. కేవలం కథలు మత్రమే పోటీకి స్వీయప్రచురణ చేయగలరు. కవిత,గజల్,నానీలు,వ్యాసం వంటివి పోటీకి తీసుకోబడవు.

2. కథలు మీ స్వంతమై ఉండాలి. ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు.

౩. పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.

4. పోటీ కోసం కథను స్వీయ ప్రచురణ చేసేటప్పుడు సంగ్రహం అనే చోట రెండు లేదా మూడు వాక్యాలలో కథ యొక్క సారాంశాన్ని తప్పకుండా రాయగలరు.

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: