మే 4, 2021

ఆకాశానికి గుంజలు

Posted in ఆకాశానికి గుంజలు, సాంఘికం-రాజకీయాలు at 7:13 సా. by వసుంధర

చిన్నప్పుడు చదివిన చందమామ కథలో- కొందరుంటారు. వారు స్వార్థమెరుగని పరోపకారులు. వారు ఆకాశం భూమ్మీద పడిపోకుండా పందిరి రాటలై ఆపుతున్న గుంజలు. వారు కల్పిత పాత్రలు కారని తెలిపే విశేషాల్ని ఈ శీర్షికలో అందజేస్తుంటాం.

ఈ కింది టపా వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

మిత్రులారా!
మున్నెన్నడూ ఎదుర్కొనని దుర్భర స్ధితి. అందరం అనుక్షణం అనుమానం నీడలో..భయం భయంగా బ్రతుకుతున్నాం.
ఇక వృద్ధులు, ఎవరూ లేని ఒంటరులు ఎదుర్కొనే సమస్యలకు అంతే లేదు.
ఇంటర్నెట్ గురించి తెలిసిన వారు వృద్ధులైనా వారికి కావాల్సినవి ఆన్ లైన్లో తెప్పించుకుంటున్నారు.
మరి intertnet ఎలా వాడాలో..వస్తువులను ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలియని వారి పరిస్దితి ఏమిటి?
మాట్లాడితేనే కరోనా అంటుకుపోతుందేమోనని తలుపులు మూసుకుని బతుకుతున్న నిస్సహాయుల పరిస్థితి ఏమిటి? వారు ఎవర్ని సహాయం అడగగలరు? ఎన్ని రోజులని అడగగలరు?
తెల్లారితే ఎన్ని అవసరాలు?
ఒకటా? రెండా?
అదే ఆ ఒంటరి వాళ్ళు రోగగ్రస్తులు కూడా అయితే? వికలాంగులు అయితే?
వాళ్ళకి కావాల్సిన మందులు,ఆహారం ఎలా?
అందుకే..
ఇలాంటి వృద్ధులకు,నిస్సహాయులకు మేమున్నాం అంటున్నారు..
” హైదరాబాద్ సైక్లింగ్ రైడర్స్ సంఘం “వారు.
ప్రాణాలకు తెగించి మీ సేవకై ముందుకు వచ్చారు.
భయపడకండి.
హైదరాబాద్ లో నివశించే వారు ఒక్క ఫోన్ చెయ్యండి. మీకేం కావాలో చెప్పండి. తీసుకువచ్చి మీకు అందిస్తారు.
ఆహారం ఉచితం. మెడిసిన్స్ పేదవారికి ఉచితం.
మీకేం భయం లేదు. ఇది నమ్మకస్తులు నిజాయితీగా చేస్తున్న సేవ. ఈ సేవలో నా కొడుకు Shiva Jujjavarapu కూడా కార్యకర్త. అందుకే మరింత ధైర్యంగా చెబుతున్నా.
95661 70334
ఈ నంబర్ కి కాల్ చేయండి.
కన్నెగంటి అనసూయ

Leave a Reply

%d bloggers like this: