మే 11, 2021

ధారావాహికల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 10:54 ఉద. by వసుంధర

లంకె

2k రైటింగ్ ఛాలెంజ్

ప్రతిలిపి రచయితలకు మరియు పాఠకులకు నమస్కారం,

2k రైటింగ్ ఛాలెంజ్ పోటీతో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. ఇచ్చిన గడువు లోపల 2,000 పదాల ధారావాహికలను రాసి నగదు బహుమతులు పొందండి. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. ధారావాహికలు ఏ అంశంపై అయినా ఉండవచ్చు.

మీరు మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ ధరావాహికలను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి “వ్రాయండి” అనే బటన్ మీద క్లిక్ చేసి, కొత్తరచనను జోడించండి. మీ ధారావాహిక యొక్క శీర్షికను జత పరిచి రెండు వాక్యాల్లో సంగ్రహాన్ని రాసి ధారావాహికను కొనసాగించి ప్రచురించండి. ప్రతిలిపి ఫోటోగ్యాలరీ లో మీ ధారావాహికకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట “కథ” ను సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “2k రైటింగ్ ఛాలెంజ్” అనే వర్గంతో పాటు మీ ధారావాహికకు సరిపోయే మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “2k రైటింగ్ ఛాలెంజ్” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు తప్పకుండా “2k రైటింగ్ ఛాలెంజ్” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి.

బహుమతులు :

1.మొదటి బహుమతి:5000

2.రెండవ బహుమతి:2500

౩.మూడవ బహుమతి:1000

ముఖ్యమైన తేదీలు:

1.మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 7.మే.2021

2.మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 22.మే.2021

౩.ఫలితాలు ప్రకటించే తేది: 25.మే.2021

పోటీలో ఎవరు పాల్గొనవచ్చు?

పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు.

నేను ఎప్పుడూ ధారావాహిక రాయలేదు. నేను కూడా పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. ధారావాహిక ఎలా రాయాలో…? సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.

పోటీలో ఎన్ని ధారావాహికాలైనా  రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

నియమాలు:

1.మీరు ధారావాహిక రాయవలసి ఉంటుంది. ధారావాహిక కనీసం 2000 పదాలు ఉండాలి.అంతకు మించి ఎన్ని పదాలైనా ఉండవచ్చు.

2.ధారావాహిక కనీసం రెండు భాగాలు ఉండాలి. ఒక్కో భాగంలో ఎన్ని పదాలైన ఉండవచ్చు, ఎన్ని భాగాలు అయినా రాయవచ్చు. (ధారావాహిక భాగాలన్నీ ఒకే లింక్ లో రాయాలి. ధారావాహిక  భాగాలు విడి విడిగా కాకుండా ఒకే లింక్ లో స్వీయప్రచురణ చేయాలి.)

3.ధారావాహిక ఏ అంశం మీద అయినా రాయవచ్చు.

4.మీరు ఎన్ని ధారావాహికలు అయినా రాయవచ్చు.

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: