మే 13, 2021

పిల్లల కథలకు ఆహ్వానం

Posted in బాల బండారం, సాహితీ సమాచారం at 6:43 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

చిన్నారులను ప్రేమించే అలవాటున్న సాహితీ మిత్రులకు – ఒక విన్నపం .,

తరతరాలుగా మనకు వేమన శతకం , సుమతీ శతకం వంటివి సుపరిచితం . అవి ఆనాటి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను అనుసరించి పెద్దల కోసం రాసినవని మనకు తెలుసు ., ఆ శతక పద్యాలన్నీ తరతరాలుగా తెలుగు వారి జ్ఞానసంపద పెంచుతున్న ఆణిముత్యాలు అని చెప్పవచ్చును .
ఇప్పటికీ విద్యా రంగంలో ఇటువంటి మకుట పద్యాలను పిల్లల కోసం విరివిగా ఉపయోగిస్తూనే ఉన్నాం . చిన్నారుల్లో భాష మీద ఇష్టాన్ని పెంచడంతో పాటుగా జ్ఞాపకశక్తి పెంచడంలో కూడా పద్య సాహిత్యం ఉపయోగపడగలదని విద్యా వేత్తలు చెప్తూనే వున్నారు ., అయినా కేవలం పద్యాన్ని ప్రతి పదార్ధంతో సహా బట్టీ పట్టించడానికి మాత్రమే ఎక్కువమంది ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇస్తున్నారు .
అలా కాకుండా ఆ పద్యాల లోని భావాన్ని సున్నితంగా అర్ధమయేలా వివరించాలని , మనసుకు హత్తుకునేలా చిన్న కధల రూపంలో మన చిన్నారులకు అందించాలనేది మా ప్రయత్నం .
ఏ శతకంలోని పద్యమైనా సరే – కొన్ని మకుట పద్యాలను ఎంపిక చేసి , ఆ పద్యాలలో దాగివున్న అర్ధాలను ఒక చిన్ని కధ రూపంలో వివరిస్తూ , సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేలా ఈ కథలను తీర్చి దిద్దాలని మా ఆలోచన .,
సమకాలీన సమస్యలను , సులభంగా అర్ధమయే భాషలో మన విద్యార్థినీ విద్యార్థులకు ఈ నవీన పద్య కథలను అందించాలనే మా ఆశ … ఆశయం కూడా .,

* మరి ఈ కధలు ఎలా ఉండాలంటే :

 • సమకాలీన ప్రపంచానికి / భాషకు అనుగుణంగా ఉండాలి .
 • కధ చెప్పి చివర ‘ నీతి ‘ అనే విధంగా ఉండరాదు ,
  కథలోని భావం పిల్లలే అర్ధం చేసుకునే విధంగా ఉండటం సరైన విధానం .,
 • 6 వతరగతి లోపల వాళ్ళ కోసం – 1/8 సైజ్ లో ఒక పేపర్ కు రెండు వైపులా వచ్చేలా ఉండాలి .,

6 నుండి 10 వ తరగతి లోపు పిల్లలకు – – 1/8 సైజ్ లో రెండు పేపర్ల కు – రెండు వైపులా వచ్చేలా ఉండాలి .,

 • కథను రాసి – చివర్లో పద్యం రాసి
  గుర్తు చేయడం ఒక విధానం .,
 • కేవలం పద్యం కోసం కధ – కాకుండా …..
  సహజంగా వ్యక్తిత్వ వికాసాన్ని ప్రేరేపించే కథనం చాలా అవసరం .,
 • వయసును బట్టి కధల స్థాయిలో / భావవ్యక్తీకరణ లో విభిన్నంగా ఉండటం అవసరం .,
 • ఒక విధంగా ఇది ఉపాధ్యాయులకు / రచయితలకు కొంత సవాలుగానే వున్నా – ఈ నాటి అవసరాల్ని / ప్రధాన్యతల్ని దృష్టిలో ఉంచుకుని , మన చిన్నారుల సమగ్ర వ్యక్తిత్వానికి ఈ విధమైన కధల అవసరం ఉన్నదని నమ్మకంతో ఈ ప్రయత్నం మొదలుపెట్టాం .,
 • ఈ విధమైన పద్యాల ఆధారంగా కధలు – – వీటితో పాటుగా – –
 • ఈ మకుట పద్యాల ఆధారంగా – చిన్ని నాటికలు / role play రూపంలో రాయడం .,
 • మంచి పాటలను – పల్లవి / చరణం – ఆధారంగా కధలు రాయడం .,
 • కధలు రాయడానికి అవసరమైన కొన్ని అంశాలు / concepts :
  —————–//——————
  1) ప్రశ్నించే అలవాటు / తత్వం .,
  2) స్నేహం / అభిమానం .,
  3) పట్టుదల & ధైర్యం .,
  4) పనిని ఇష్టపడటం /
  పని విలువ
  5) ప్రేమ –
  6)ఆనందం / సంతోషం /
  ద్వేషం / అసూయ / కోపం /
  బాధ ( emotions )
 • కధలు మే నెలాఖరు నాటికి
  చేరాలి .,
 • వచ్చిన కథలను ఎంపిక చేయడం కోసం ఒక చిన్న గ్రూప్ వుంటారు .,
 • జూన్ & జులై నెలల్లో – ఈ
  కధల పుస్తకాలు చిన్నారుల
  చేతుల్లో చూడాలని మా
  ఆలోచన .,
 • చిన్నారులను un conditional గా ప్రేమిస్తూ , వాళ్ళ చదువులు / జీవితం అన్ని విధాలుగా ఆనందంగా గడపాలని ఆశిస్తూన్న మిత్రుల సహకారంతో మొదలు పెట్టిన ప్రయత్నం ఇది ….. ఈ ప్రయత్నాన్ని విజయవంతం
  చేయడంలో మీ సహకారాన్ని – రచనల రూపంలో ఆర్థిస్తూ / ఆశిస్తూ …….
  అభినందనలతో –
 • వివరాలకు :
  9490175160 .,

Leave a Reply

%d bloggers like this: