మే 18, 2021

జాతీయ నాటకాల పోటీః ప్రతిలిపి

Posted in నాటిక, నాటకం పోటీలు, రచనాజాలం at 5:26 సా. by వసుంధర

నాటకాలు

మనుషుల మధ్య మనుషుల కోసం మనుషులచే జరిపించే సజీవ సాహితీ ప్రక్రియ నాటకం. ఇతర సాహిత్య ప్రక్రియలతో పోల్చుకున్నప్పుడు నాటకాలకు ఉన్న విశిష్టత ఏమిటంటే? నాటకం పండిత, పామరులను సైతం రజింపచేసే శక్తి ఉండటం. చదువు వచ్చిన వాళ్లకి మాత్రమే కాకుండా చదువు రాని వాళ్లకి సైతం అర్థం అవుతుంది. కవిత, కథ, నవల లాంటి సాహిత్య ప్రక్రియల్లో భావాల్ని ఊహించుకోగలం లేదా అవగాహన చేసుకుంటాం నాటకమైతే ఒక సజీవ దృశ్యం కళ్ల ముందు కదలాడుతూ ఉండటం చేత దృశ్యానికి శరీరం ప్రతిస్పందిస్తూ పూర్తిస్థాయి అనుభూతిని పొందగలము.ప్రజల నుండి పరిస్థితుల నుండి తీసుకున్న వాస్తవ సంఘటనల సమాహారమే నాటకం. ఈ మధ్య నాటక రచన కనుమరుగు అవుతోంది. ఆ లోటును పూడ్చడానికి ప్రతిలిపి తెలుగు విభాగం నాటకాల పోటీతో మీ ముందుకు వచ్చింది. ఈ పోటీకి వచ్చిన రచనలను ఒక వర్గంగా ప్రతిలిపి హోం పేజిలో ఉంచుతాము. ప్రతిలిపిలోని ప్రతి ఒక్క రచయిత కనీసం ఒక్క నాటకమైన రాయాలని కోరుతున్నాము. కనుమరుగు అవుతున్న తెలుగు నాటకాన్ని పరిపుష్టి చేయడానికి మేము చేస్తున్న ఈ కృషికి మీరు తోడు నిలవాలని ఆశిస్తున్నాము.

 నాటకాలను స్వీయప్రచురణ ఎలా చేయాలి?

మీ నాటకాలను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి “వ్రాయండి” అనే బటన్ మీద క్లిక్ చేసి, కొత్తరచనను జోడించండి. మీ నాటకం యొక్క శీర్షికను జత పరిచి రెండు వాక్యాల్లో సంగ్రహాన్ని రాసి నాటకాన్ని కొనసాగించి ప్రచురించండి. ప్రతిలిపి ఫోటోగ్యాలరీ లో మీ నాటకానికి తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట “కథ” ను సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట  “నాటకాలు ” అనే వర్గం సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి.

బహుమతులు :

ఐదు ఉత్తమ నాటకాలకు 500 చొప్పున నగదు బహుమతిని ఇవ్వబడును.

పది ఉత్తమ నాటకాలకు ప్రశంసా పత్రాన్ని అందజేయగలము.

ముఖ్యమైన తేదీలు:

1. మీ నాటకాలను స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 11.మే.2021

2. మీ నాటకాలను స్వీయప్రచురణ చేయడానికి ముగింపు తేది:27.మే.2021

3. ఫలితాలు ప్రకటించు తేది:30.మే.2021

పోటీలో ఎవరు పాల్గొనవచ్చు?

పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు.

నేను ఎప్పుడూ నాటకాలు రాయలేదు. నేను కూడా పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. నాటకాలు ఎలా రాయాలి అనే సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.

నియమాలు:

1. మీరు నాటకం రాయవలసి ఉంటుంది.నాటకం ఏ వర్గానికి సంబందించినది అయినా ఉండవచ్చు.

2. మీరు ఎన్ని నాటకాలు అయినా రాయవచ్చు.ప్రతీ నాటకాన్ని వేరువేరుగా స్వీయప్రచురణ చేయాలి.

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: