మే 18, 2021

సహరి కథలు 2020

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 4:56 సా. by వసుంధర

పోయిన ఏడాది వరలక్ష్మి వ్రతానికి మన సహరి ప్రారంభం అయింది. అచిర కాలంలోనే రచయితలలో, పాఠక మహాశయులలో మంచి పేరు సంపాదించుకోగలిగింది. దీని వెనుక మీ అందరి ఆశీస్సులు ఉన్నాయని మాకు తెలుసు.
సహరి ఒక వెబ్ మాగజైన్ కాదు. అంతకంటే చాలా ఎక్కువ!
అంతర్జాలంలో అసలు సిసలు మాగజైన్ చదివిన అనుభూతి కలిగించే ఏకైక అంతర్జాల పత్రిక. తెలుగులో తొలి సమగ్ర పత్రికగా దీనిని తీర్చిదిద్దాం. శ్రేయోభిలాషుల, పాఠక మహాశయుల సలహాలను స్వీకరిస్తూ ఉన్నత ప్రమాణాలతో మీ ముందుకు వారం వారం క్రమం తప్పకుండా సహరిని తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నాము.
కాలం చాలా వేగంగా పరిగెడుతుంది అన్నది మళ్ళీ ఋజువు అయింది. అప్పుడే సహరి ప్రారంభం అయి ఒక సంవత్సరం కాబోతుంది.
కరోనా పరిస్థితులు శాంతిస్తే ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా మీ అందరి సమక్షంలో వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవాలని ఆశిస్తున్నాము.
జూలై 31 సంచిక నుంచి డిసెంబర్ 25 సంచిక వరకు 2020 లో మొత్తం 22 సహరి వారపత్రికలు వెలువడ్డాయి. వాటిలో 133 కథలు ప్రచురించబడ్డాయి.
ఆ కథలన్నిటినీ అయిదు వాల్యూంసు గా విభజించి సహరి వెబ్ సైట్ లో అందరికీ అందుబాటులో పెడుతున్నాము.
ఈ వాల్యూంస్ ని ఎటువంటి రుసుము చెల్లించకుండా చదువుకోవచ్చు.
అలా చదువుకోవడమే కాదు, చదివి బహుమతులు కూడా గెలుచుకోవచ్చు.
కథా రచయితలకు బహుమతులు అందించాము, పారితోషికాలు అందించాము. ఈ సారి పాఠక మహాశయులకు కూడా తగు రీతిన బహుమతులు ఇచ్చి ఆనందించాలని నిర్ణయించుకున్నాము.
సహరి కథలు 2020 అనే ఒక సంకలనాన్ని వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించదలిచాము. అందులో 20 కథలు మాత్రమే ముద్రించబడతాయి.
ఈ 133 కథలలో ఆ 20 ఏవి అనేది మీరే ఎంపిక చేస్తారు. అవును, ఆ ఎంపిక బాధ్యత సహరి పాఠక మహాశయులదే!
మీరు ఎంపిక చేసిన కథలలో వేటికి పాఠాకాదరణ ఎక్కువగా ఉందో అవే సంకలనంలో చోటు సంపాదించుకుంటాయి.
మీరు మీకు నచ్చిన పది కథల పేర్లను మాకు మైల్ చేయండి. లేదా వాట్సప్ చేయండి.
ఇలా ఎంపికలో భాగస్వామ్యులైన పాఠకులలో పదిమందిని లాటరీ ద్వారా ఎంపిక చేసి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున బహుమతి అందజేస్తాము. అంతే కాదు, వారికి “సహరి కథలు 2020” పుస్తకం ఉచితంగా అందచేయబడుతుంది.

మీ

సహరి

Leave a Reply

%d bloggers like this: