మే 19, 2021

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక రచనలకు ఆహ్వానం!

Posted in మన పత్రికలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 3:47 సా. by వసుంధర

నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవం (జూలై 10, 2021) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం, ట్రావెలాగ్ ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. అందులో నుంచి ఒక ఉత్తమమైన రచనకు $1000 (వెయ్యి రూ.) పారితోషికంతో బాటూ “నెచ్చెలి ఉత్తమ రచన అవార్డు” ప్రదానం ఉంటుంది. ఉత్తమ రచన ఎంపిక, అవార్డు ప్రదానం వివరాలు ఆగస్టు సంచికలో వెలువడతాయి. నెచ్చెలి సంపాదకుల ఎంపిక మాత్రమే కాక పాఠకుల ప్రతిస్పందనని బట్టి కూడా ఉత్తమ రచన ఎంపిక జరుగుతుంది. ప్రత్యేక రచనలు జూలై సంచికలో ప్రచురించబడ్డాక ప్రతీ పోస్టు పై వచ్చిన కామెంట్ల సంఖ్య, ఉత్తమ వ్యాఖ్యల సారాంశాన్ని బట్టి అవార్డు ప్రదానం జరుగుతుంది.  ప్రత్యేక సంచికలో రచన ప్రచురితం కావాలన్నా, నెచ్చెలి అవార్డుకి ఎంపిక కావాలన్నా ఈ క్రింది అంశాలు తప్పనిసరిగా పాటించాలి.     

1. రచనలు పంపేవారు విధిగా నెచ్చెలి పత్రిక (https://www.neccheli.com/) కు, నెచ్చెలి యూట్యూబ్ ఛానెల్ (https://www.youtube.com/channel/UCk6zjjpWUJW2g4zTCVtPJOg/featured) కు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇవి రెండూ పూర్తిగా ఉచితం.
2. రచన  ఈ – మెయిలు పంపే ముందే మూడు విశేషణాత్మక కామెంట్లు నెచ్చెలిలో డైరక్టుగా పోస్టు చెయ్యాలి. కామెంట్లు పోస్టు చెయ్యడానికి నిబంధనలు:- ఇప్పటి వరకు నెచ్చెలిలో వచ్చిన విభిన్న ప్రక్రియల్లో రచనలు, నెచ్చెలి ఛానెల్లో వీడియోల నుంచి మీకు నచ్చినవి ఏవైనా మూడింటిని ఎంచుకుని ప్రతీ రచనకూ కామెంటు రూపంలో ఒక పారాగ్రాఫులో చిన్న విశ్లేషణ పోస్టు చెయ్యాలి. కామెంటులో విధిగా మీ పేరు రాయాలి. పేరు లేని కామెంట్లు లెక్క పెట్టబడవు.  రచనతో బాటూ మీరు కామెంటు చేసిన రచన పేరు, కామెంటు చేసిన తేదీ విధిగా ఈ-మెయిలులో రాయాలి. కామెంటు ఆయా రచనల దగ్గర  పోస్టు మాత్రమే చెయ్యాలి. ఈ-మెయిలులో పంపకూడదు. 
3. కథ, కవితలకు ఇప్పటి సమాజంలో స్త్రీల సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా ఉండాలి. వ్యాసం, ట్రావెలాగ్ లకు వస్తు నియమం లేదు.  
4. వస్తువు, శైలి, ఎత్తుగడ, ముగింపులలో కొత్తదనానికి ప్రాధాన్యతని ఇచ్చే రచనలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. 
5. మీ రచన విధిగా యూనికోడ్ లో ఉండి వర్డ్ (లేదా) గూగుల్ డాక్ లో పంపాలి. రచన A4 లో పది పేజీలకు మించకూడదు.
6. రచనతో బాటూ విధిగా రచన మరెక్కడా ప్రచురితం కాలేదని, పరిశీలనకు పంపబడలేదని హామీ పత్రం జతచెయ్యాలి.
7. విధిగా మీ ఫోటో, ఒక పారాగ్రాఫులో మీ గురించి వివరాలు యూనికోడ్ లో రాసి జత చెయ్యాలి.
8. రచనలు చేరవలసిన చివరి తేదీ- మే 25, 2021. గడువు తర్వాత చేరినవి పరిశీలనలోకి తీసుకొనబడవు. 
9. ఒక్కొక్కరు ఒక ప్రక్రియకు ఒక రచన చొ||న అన్ని ప్రక్రియలకూ రచనలు పంపవచ్చు.    
10. ఈ-మెయిలు మీద సబ్జెక్టు “నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక-2021” కి అని రాసి editor.neccheli@gmail కు పంపాలి.  
11. ఇంగ్లీషులో పంపే రచనలు అనువాదాలైనా కూడా స్వీకరించబడతాయి. మూల రచన, రచయిత వివరాలు, మూల రచన ప్రచురణ వివరాలు విధిగా జత పరచాలి. అనువాదాలు ఎక్కడా ప్రచురితం కాలేదని హామీ పత్రం జతపరచాలి. పైన తెలుగు రచనలకు ఇచ్చిన  నిబంధనలు అన్నీ పాటించాలి. 
12. ప్రత్యేక సంచికకు ఎంపిక కాని రచనలు సాధారణ ప్రచురణకు స్వీకరించబడి నెచ్చెలిలో నెలవారీ సంచికలో ప్రచురింపబడతాయి. ఇందులో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు. 

Leave a Reply

%d bloggers like this: