మే 21, 2021

చందమామలో వసుంధర కథలు- ఆంగ్లంలో

Posted in పుస్తకాలు, బాల బండారం, వసుంధర రచనలు, సాహితీ సమాచారం at 12:01 సా. by వసుంధర

తెలుగునాట తనదైన ప్రత్యేక శైలితో పెద్దల్నీ-పిల్లల్ల్నీ, పండితుల్నీ-పామరుల్నీ అలరించిన పిల్లల రంగుల బొమ్మల మాసపత్రిక చందమామ. అందులో మా (వసుంధర) కథలు ఇదువందలకు పైగా ప్రచురితం కావడం మా అదృష్టం.

చందమామ కథల్ని చందమామ అంత గొప్పగానూ – తెలుగువారికి అందించాలన్న గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన ప్రచురణ సంస్థ జెపి పబ్లిషర్సు. అందుకు వారు మా కథల్ని ఎంపిక చేసుకోవడం మళ్లీ మా అదృష్టం.

51 కథలు. 144 పేజీలు. పీజీకి కనీసం ఒక రంగుల బొమ్మ. చందమామలో అనుభవం, చందమామతో అనుబంధం ఉన్న – శక్తి దాస్ బొమ్మలు. ఇవి ఈ సంపుటిలో కొన్ని ప్రత్యేకతలు.

ఇప్పుడీ కథలు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయని తెలియబర్చడానికి చాలా ఆనందంగా ఉంది. వివరాలకు లంకె కింఅ ఇస్తున్నాం.

లంకె

Leave a Reply

%d bloggers like this: