మే 22, 2021

వినిపించే కథలు

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 1:04 సా. by వసుంధర

కథ చదవడం ఒక అనుభవం. కథ వినడం ఒక అనుభవం. వినిపించడానికి కథను చదవాలంటే – ముందు చదివేవారు కథను ఆస్వాదించాలి. వారి గొంతు గంభీరంగానూ, మృదుమధురంగానూ ఉండాలి. ఆ గొంతులో భావాలు పలకాలి. అప్పుడు శ్రోతలు ఆ కథను ఆస్వాదిస్తూ, రసానుభూతి చెందుతారు.

శ్రీ వెంపటి కామేశ్వరరావుగారిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి.

వారిప్పుడు ‘వినిపించేకథలు’ అ యూట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు. ఆకాశవాణి లో casual news reader, auditioned drama artist. గతంలో దూరదర్శన్ లోనూ న్యూస్ రీడర్ గా ఉన్నారు. వివిధ రంగస్థల, దూరదర్శన్, ఆకాశవాణి నాటికల్లో పాల్గొన్నారు. స్టేజి ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యాతగా బహు ప్రశంసలు పొందారు.ఫో టోగ్రఫీ, వీడియోగ్రఫీ వారి హాబీలు. ఓల్డ్ మెలోడీస్ వినడం అంటే మక్కువ ఎక్కువ.

శ్రీ వెంపటి కామేశ్వరరావు తెలుగు కథను పాఠకులనుంచి శ్రోతలకు తీసుకు వెళ్లడానికి పూనుకోవడం – తెలుగు కథ భవిష్యత్తుకి శుభసూచన.

వారికి అక్షరజాలం శుభాకాంక్షలు, శుభాభినందనలు.

అంతర్జాలంలో వినిపించే కథలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: