మే 23, 2021

చిన్నకథల పోటీః రంజని

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:42 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

రంజని తెలుగు సాహితీ సమితి
చిన్న కథానికల పోటీ

మిత్రులారా…..
కాలం స్తబ్దుగా, ఒకింత విచారంగా గడుస్తోంది కదూ!
వేడుకలు జరిపే వీలు లేదు.
ఉత్సవాలకు అనుమతి లేదు.
అందరం కలిసే అవకాశమూ లేదు.
మహమ్మారి నిష్క్రమణ కోసం అందరం ఎదురుచూస్తున్నాం.

ఇలాంటి నేపథ్యంలో, మనను ఉత్సాహ పరుచుకుని కాగితమే వేదికగా కలాలను కదిలిస్తే ఎలా ఉంటుంది?
బావుంటుంది కదూ…

అందుకే

       రంజని కార్యవర్గం ,
 రంజని తెలుగు సాహితీ సమితి 
        ఆధ్వర్యంలో
      చిన్న కథానికల పోటీ 

నిర్వహించాలని నిర్ణయించింది.

సూచనలు….

1.కథానికలు కరోనా నేపథ్యం కాకూడదు. అంశం మరేదైనా అయి ఉండాలి.

 1. నిడివి మీ చేతి రాతలో 3 పేజీలు చాలు. పేజీకి 23-25 లైన్లు ఉండేట్లు చూసుకోండి.
 2. సామాజిక అంశాలేవయినా కథాంశంగా స్వీకరించవచ్చు. అయితే ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడి ఉండరాదు.
 3. స్వీయ రచన అని, అనుస(క)రణ కాదని, ఎక్కడా/ఎప్పుడూ/ ఏ బ్లాగ్ లోనూ/ fb/whatsapp ఇత్యాది వాటిల్లో ప్రచురించ బడలేదని రచయిత హామీ పత్రం ఇవ్వవలసి ఉంటుంది.
 4. కథానికలు చేరవలసిన ఆఖరి తేదీ….05.06.2021.
 5. కథానికలు పంపవలసిన మెయిల్ ఐడి…..mattiguntav@gmail.com

మొత్తం పది (10) ఉత్తమ కథానికలకు రూ.అయిదు వందల చొప్పున(Rs.500) బహుమతి ప్రదానం జరుగుతుంది….

కథకులందరికీ సాదర ఆహ్వానం.

……….రంజని కార్యవర్గం ,

Leave a Reply

%d bloggers like this: