మే 27, 2021

అన్నమయ్య అవగాహనలో డా. పతంజలి

Posted in పరమార్థం, పుస్తకాలు, రచనాజాలం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 10:37 ఉద. by వసుంధర

డా. తాడేపల్లి పతంజలి అక్షరజాలం వీక్షకులకు సుపరిచితులు. అన్నమయ్యను అవగాహన చేసుకొనడానికి వారు చేస్తున్నది నిర్విరామకృషి.

తాజాగా వారు –

శ్రీమత్ త్వదీయ చరితామృత మన్నయార్య పీత్వాపినైవ సుహితా మనుజా భవేయు:త్వం వేంకటా చలపతే రివ భక్తి సారం శ్రీ తాళ్లపాక గురుదేవ నమో నమస్తే (ఓ అన్నమాచార్యా! మీ కీర్తనల చరితామృతాన్ని – ఎంత తాగినప్పటికీ మనుష్యులు తృప్తి చెందరు. వేంకటేశ్వరస్వామివలెనే ఈ భక్తులకి కూడా మీ కీర్తనలలోని భక్తిసారమే నిజమైన కళగా అనిపిస్తుంది.. తాళ్ళపాక గురుదేవా! మీకు మానమస్సులు. నమస్సులు)

అంటూ తను చేపట్టిన కార్యక్రమాన్ని ‘ఏదియును లేని దేటిజన్మము’ అనే కృతితో అన్వయించి వినమ్రులై ఇలా మనవి చేసుకుంటున్నారుః

అన్నమయ్యా !

ఏదియును లేని దేటిజన్మము ? (1-301) అని నువ్వే అన్నావ్ కదా !

ఆ కీర్తనలోనే నా బోటి పామరులకు ఒక అవకాశం కలిగించావు.

“అతిశయంబగు వేంకటాద్రీశుసేవకులె/గతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను”

నేను ఇప్పుడు చేస్తున్నది అదేనయ్యా !

స్వామి వారి పదములు పట్టుకొన్న నీ పదములు పట్టుకొనే బుద్ధి కలిగియున్నాను.

నీ రచనా విశేషాలను నీ అనుగ్రహంతో ఇప్పటికి 09 పుస్తకాల పుష్పాలు గా మార్చాను.

నీ దయతో 26, 27, 28 సంపుటాలలో ఉన్న 933 కీర్తనలకు ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు తి.తి.దే వారి కోసం వ్రాస్తున్నాను.

ఒక పసిపిల్లవాడు కొండను ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు.

ఆ కొండ అతడిని చూసి నవ్వుతుందా?

కాదు… ఆశీర్వదిస్తుంది. కదూ…!

కొండవంటి దొరవు నీగుణ మేల విడిచేవు(10-77)

నీ పుట్టిన రోజట.

నా ఎదలో నువ్వు పుట్టని రోజంటూ ఉందా?

అన్నమయ్య వేంకటేశా !

పరమాత్ము చింతచేత బదుకు నిశ్చయమాయ(2-145)

ఏఁటిమాట లివి విన నింపయ్యీనా మది(2-67)

వీరి వెబ్‍సైటు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: