జూన్ 6, 2021

అంతర్జాతీయ ధారావాహికల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:51 సా. by వసుంధర

లంకె

నమస్తే…

మీకు నవలలు రాయడం బాగా ఇష్టమా? మీ రచనలను చిన్నకథలుగా కూర్చలేకపోతున్నారా? అయితే మీకు ఇదొక తీపికబురే! మీ అనర్గళ రచనలను ధారావాహికలుగా రాసి పోటీలో పాల్గొనండి. ప్రతిలిపి నవలోత్సవం అంతర్జాతీయ ధారావాహికల పోటీతో మీ ముందుకు వచ్చింది. ఈ పోటీలో పాల్గొనడానికి మీరు ధారావాహికలను రాసి స్వీయప్రచురణ చేయవలసి ఉంటుంది.

మీరు మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లోకి వెళ్ళి “వ్రాయండి” అనే బటన్ మీద క్లిక్ చేసి, కొత్తరచనను జోడించండి. మీ ధారావాహిక యొక్క శీర్షికను జత పరిచి రెండు వాక్యాల్లో సంగ్రహాన్ని రాసి ధారావాహికను కొనసాగించి ప్రచురించండి. ప్రతిలిపి ఫోటోగ్యాలరీ లో మీ ధారావాహికకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట “కథ” ను సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “నవలోత్సవం” అనే వర్గంతో పాటు మీ ధారావాహికకు సరిపోయే మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “నవలోత్సవం” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు తప్పకుండా “నవలోత్సవం” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి.

బహుమతులు:

1. మొదటి బహుమతి : 10,000

2. రెండవ బహుమతి : 5,000

3. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రం మెయిల్ చేయబడును.

ముఖ్యమైన తేదీలు:

1. మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 2.జూన్.2021

2. మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 29.జూన్.2021

౩. ఫలితాలు ప్రకటించే తేది: 5.జూలై.2021

నేను ఎప్పుడూ ధారావాహిక రాయలేదు. నేను కూడా పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. ధారావాహిక ఎలా రాయాలో…? సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.

పోటీలో ఎన్ని ధారావాహికాలైనా  రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

నియమాలు:

1. మీరు ధారావాహిక రాయవలసి ఉంటుంది. కనీసం రెండు భాగాలు ఉన్న రచనలు మాత్రమే ధారావాహికలుగా స్వీకరించబడతాయి.

2. ధారావాహిక ఎన్ని భాగాలు అయినా ఉండవచ్చు. తప్పకుండా మీ ధారావాహిక యొక్క అన్ని భాగాలు ఒకే లింక్ లో ఉండాలి. అలా ఉన్న ధారావాహికలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి.

3. ధారావాహిక ఏ అంశం మీద అయినా రాయవచ్చు.

4. మీరు ఎన్ని ధారావాహికలు అయినా రాయవచ్చు. పదపరిమితి లేదు.

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: