జూన్ 6, 2021

తెలుగు పద్యంః ప్రతిలిపి

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 3:53 సా. by వసుంధర

లంకె

నమస్తే…

తెలుగు పద్యాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి భావాలనైనా అలవోకగా చెప్పగలిగే సామర్థ్యం తెలుగు పద్యాలకు ఉన్నది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. తెలుగు పద్యాలను ఒక దగ్గర చేర్చే దిశగా ప్రతిలిపి అడుగులు వేస్తోంది. ప్రతిలిపి చేసే ఈ మహత్తర కార్యానికి మీ సహకారం తప్పక కావాలి. మా ప్రయాణంలో మీ సహకారం అందించి మీరు రచించిన పద్యాలను మీ ప్రతిలిపి ప్రొఫైల్ లో స్వీయప్రచురణ చేయవలసినదిగా కోరుతున్నాము. మీ పద్యాలను అన్నింటిని కలిపి ప్రతిలిపిలో ఒక ప్రత్యేక విభాగంగా చేరుస్తాము. ఇందుకొరకు ప్రతిలిపి తెలుగు పద్యాలు అనే శీర్షికతో మీ ముందుకు వచ్చింది.

మీరు మీ పద్యాలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ పద్యాలను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి, కొత్త రచనను జోడించండి. శీర్షిక రాసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటో గ్యాలరీలో మీ పద్యాలకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట కవిత సెలెక్ట్ చేసి, వర్గం అనే చోట “పద్యం” అనే వర్గం సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. 

నియమాలు:

1. మీరు ఎన్ని పద్యాలు అయినా స్వీయప్రచురణ చేయవచ్చు. ప్రతీ పద్యాన్ని విడివిడిగా స్వీయప్రచురణ చేయాలి.

2. మీరు ఎక్కువ సంఖ్యలో పద్యాలు స్వీయప్రచురణ చేయడం వలన మీ రచనల సంఖ్య పెరుగుతుంది.

3. మీరు ప్రచురించిన పద్యాలను ఒక విభాగంగా చేర్చడం వలన మీ రచనలు ప్రతిలిపి లో ఎక్కువ మంది పాఠకులు చదివే అవకాశం ఉంది. తద్వారా మీ రచనలకు రీడ్ కౌంట్ పెరుగుతుంది.

4. ఇది పోటీ కాదు కనుక ఎలాంటి నగదు బహుమతులు కానీ ప్రశంసా పత్రాలు కానీ ఉండవు. 

ముఖ్యమైన తేదీలు:

1. మీ పద్యాలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 4.జూన్.2021

2. మీ పద్యాలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.జూన్.2021

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: