జూన్ 6, 2021

వర్షాకాలపు కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 3:47 సా. by వసుంధర

లంకె

నమస్తే..

వానా వానా వల్లప్ప…వాకిలి తిరుగు చల్లప్ప… అని మనం ఆడుకునే ఉంటాం. వర్షం లో తడవటం, కాగితపు పడవలతో ఆడుకోవడం లాంటివి చేసే ఉంటాం. వర్షాకాలం వస్తే చాలు అటక మీది రంగు రంగుల గొడుగులు స్వేచ్చగా నాట్యం చేస్తుంటాయి. వర్షంలో తడుస్తూ..అమ్మతో దెబ్బలు తినే ఉంటాం. మరి అలాంటి జ్ఞాపకాలు మీ దగ్గర ఉన్నాయా? అయితే  ప్రతిలిపి నింగి-నీరు వర్షాకాలపు కథల పోటీకి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. వర్షాకాలానికి సంబంధించిన కథలను రాసి, నింగి-నీరు పోటీకి స్వీయప్రచురణ చేసి మీ అనుభవాలను ప్రతిలిపి తో పంచుకోండి.

మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రామం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీ లో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట కథ సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “నింగి-నీరు” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “నింగి-నీరు” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు “నింగి-నీరు” అనే వర్గం తో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. తప్పకుండా మీరు మీ కథలను స్వీయప్రచురణ చేసేటప్పుడు “నింగి-నీరు” అనే వర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన కథలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి.

సంగ్రామం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో రాయాలి.

ఏమి రాయాలి?

మీరు చూసిన, మీకు జరిగిన లేదా మీరు ఉహించుకొని కథలను రాయవచ్చు. కథలు వర్షాకాలానికి సంబంధించినవి ఉంటే చాలు. కథలో వర్షానికి సంబంధించిన ఎలాంటి వస్తువు ఉన్నా సరిపోతుంది.

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

1. మొదటి రెండు అత్యుత్తమ కథలను మా ప్రతిలిపి బృందం చదివి ఆడియోను ప్రతిలిపి యు ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.

2. మొదటి పది ఉత్తమ కథలను బ్యానర్ గా చేసి ప్రతిలిపి వెబ్ సైట్ లో రెండు రోజుల పాటు ఉంచడం జరుగుతుంది.తద్వారా మీ ప్రొఫైల్ ఎక్కువ మంది పాఠకులకు తెలిసే అవకాశం ఉంది.

3. మొదటి పది మంది రచయితలకు డిజిటల్ సర్టిఫికేట్ పంపడం జరుగుతుంది.

 ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 4.జూన్.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 30.జూన్.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 3.జూలై.2021

నియమాలు :-

1. కథలు మీ స్వంతమై ఉండాలి. ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు.

2. పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: