జూన్ 9, 2021

వల్లూరి చిన్న మాలకొండయ్య స్మారక ఆడియో కథల పోటీ

Posted in కథల పోటీలు at 11:19 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

వల్లూరి చిన్న మాలకొండయ్య స్మారక ఆడియో కథల పోటీ

మీకు నచ్చిన ప్రచురితమైన లేదా కొత్త కథ అయినా, మీ స్వరంలో కానీ, మీకు తెలిసిన వారి స్వరంలో ఆడియో(వీడియో) రికార్డ్ చేసి పంపాలి.

సైజ్ పెరిగితే sending problem రావచ్చు. కాబట్టి రెండు మూడు భాగాలుగా పంపవచ్చు.
తడబాటు లాంటి మిస్టేక్స్ వస్తే ఒకటి రెండు సెక్షన్లు పాజ్ ఇచ్చి మళ్ళీ చదవండి. అనవసరమైన దానిని మేము ఎడిట్ చేసుకుంటాం.

నిబంధనలు

ఆడియో (వీడియో) నిడివి:
7 నుంచి 12 నిమిషాల లోపు
ఉండాలి.
అర్హత
ఛానెల్ లో అప్లోడ్ చేసిన తర్వాత 25 గంటల వ్యూడురేషన్ ఉన్నవాటిని మాత్రమే పోటీకి అర్హమైనవి గా పరిగణించబడతాయి. (వ్యూడురేషన్ అంటే వీడియోని ప్రేక్షకులు చూసిన సమయం. ఉదాహరణకు పది నిమిషాల నిడివి ఉన్న వీడియోని వందమంది పూర్తిగా చూస్తే 1000(16 గం. 40ని.ల) నిముషాల వ్యూడురేషన్ వస్తుంది. అలా కాకుండా ఒక నిమిషం చూస్తే వ్యూడురేషన్ 100 (1గంట.40ని.)నిమిషాలు వస్తుంది.)
బహుమతులు : మొదటి మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన 6 కథలకు 500 రూపాయల చొప్పున.

                 ఇందూ రమణ

Leave a Reply

%d bloggers like this: