జూన్ 13, 2021

అంతర్జాతీయ తెలుగు మినీకథల పోటీ

Posted in కథల పోటీలు at 7:04 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

అంతర్జాతీయ తెలుగు మినీ కథల పోటీ

ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు చిన్న కథలపోటీని నిర్వహిస్తున్నట్టు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు డా. గజల్ శ్రీనివాస్, రెడ్డప్ప ధవేజి ఒక ప్రకటనలో తెలియజేశారు.
కథ నిడివి చేతిరాతలో A4 లో రెండున్నర పేజీలు డి.టి.పి.లో అయితే ఒకటిన్నర పేజీ మించకూడదు. పేజీకి ఒకవైపుమాత్రమే రాయాలి, దస్తూరి స్పష్టంగా ఉండాలి ఒక్కరు ఒక్క కథను మాత్రమే పంపాలి. కథలు తెలుగు భాష లేదా భారతీయత వీటిలో ఏదో ఒక అంశం మీద మాత్రమేరాయాలి. హామీపత్రంలో తప్ప కథ పేజీలోఎక్కడా రచయిత పేరు,వివరాలు ఉండకూడదు. హామీపత్రంలో ,కథ తమ సొంత రచన అని,ఇంతకు ముందు ఎందులోను ప్రచురింపబడలేదనీ,ప్రసారమవలేదనీ,ఏ పోటీకి పంపలేదని తప్పనిసరిగా రాయాలి. హామీ పత్రంలో మాత్రమే రచయిత పేరు, పూర్తి చిరునామా, వాట్సప్ నెంబర్, మెయిల్ ఐ.డి ఉండాలి.
కథలను డాక్టర్ ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి, సమన్వయ కర్త, ఆంధ్ర సారస్వత పరిషత్, 11-1-4,S.B.I మోబర్లీపేట బ్రాంచ్ బిల్డింగ్, మెయిన్ రోడ్, అమలాపురం-533201 చిరునామాకు, ప్రవాస భారతీయులు dr.srskolluri@gmail.com కి జూన్ 25 వ తేదీ లోపుగా అందేటట్టు పంపాలి.
విజేతల వివరాలను జూలై 18 వ తేదీన,10.30 కి జరిగే అంతర్జాల కథా సదస్సులోతెలియజేస్తారు. ఆంధ్ర సారస్వత పరిషత్ face book page లో వీక్షించవచ్చు. అదేరోజు విజేతలకు ప్రథమ బహుమతిగా 3,000/-, ద్వితీయ బహుమతి గా 2,000/-, తృతీయ బహుమతిగా 1,000/- , రెండు ప్రత్యేక బహుమతులుగా 500/-నగదు తో పాటు ప్రశంసాపత్రాలు అందజేయబడతాయని వారు తెలిపారు.

– ధవేజి, ప్రదాన కార్యదర్శి
ఆంధ్ర సారస్వత పరిషత్,ప్రదాన కార్యాలయం, భీమవరం ,ప.గో.జిల్లా 9703115588

Leave a Reply

%d bloggers like this: