జూన్ 13, 2021

నాన్నకు ప్రేమతో…: ప్రతిలిపి కథల పోటీ

Posted in కథల పోటీలు at 6:38 సా. by వసుంధర

లంకె

నమస్తే….

మనలోని జీవాన్ని నింపి,అల్లారు ముద్దుగా పెంచి ,మనలోని లోపాలను సరిచేస్తూ,భవిష్యత్తుకు పునాదులు వేసి మనకు గమ్యం చూపేది నాన్న. తన గురించి ఆలోచించకుండా ఎల్లప్పుడూ కుటుంబ సంక్షేమం కోసం శ్రమించే ఏకైక వ్యక్తి నాన్న. అమ్మ ప్రేమ గురించి ,అమ్మ తపన గురించి మనం సాధారణంగా వింటూనే వుంటాం. కానీ నాన్న కష్టాన్ని మనం చాలా సందర్బాలలో గుర్తించము. అందుకేనేమో నాన్న వెనుకబడ్డాడు. కుటుంబ భారాన్ని మోస్తూ,గొప్ప గురువు గా ,పిల్లలకు మంచి స్నేహితుడిగా ఉంటాడు నాన్న.  కొందరి జీవితాలలో నాన్న ఒక శాపంగా కూడా ఉంటాడు. ఫాదర్స్ డే  సందర్బంగా “నాన్నకు ప్రేమతో” అనే పోటీతో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. నాన్నకు సంబంధించిన కథలను లేదా మీ అనుభవాలను రాసి మీ తండ్రిగారికి అంకితం ఇవ్వండి.

మీరు మీ కథలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్ లో వెళ్ళి వ్రాయండి మీద క్లిక్ చేసి,కొత్తరచనను జోడించండి. శీర్షిక రాసి సంగ్రామం జతచేసి రచనను కొనసాగించి ప్రచురించండి. ఫోటోగ్యాలరీ లో మీ కథకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట కథ సెలెక్ట్ చేసి, వర్గం  అనే చోట “నాన్నకు ప్రేమతో” అనే వర్గం తో పాటు మీ కథకు తగ్గ  మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే  “నాన్నకు ప్రేమతో” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు తప్పకుండా “నాన్నకు ప్రేమతో” అనే వర్గం తో పాటు మరో రెండు వర్గాలను  తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి.

ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధంగా ఉండును:-

న్యాయనిర్ణేత అందించిన ఫలితాలు ఆధారంగా:-

1. మొదటి రెండు ఉత్తమ కథలకు 1000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇవ్వబడును.

2. మొదటి మూడు నుండి పది కథల వరకు 500 రూపాయల నగదు బహుమతి ఇవ్వబడును.

3. మొదటి పది ఉత్తమ రచయితలకు ప్రశంసాపత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది : 11.జూన్.2021

2. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది : 26.జూన్.2021

3. ఫలితాలు ప్రకటించే తేది : 30.జూన్.2021

సంగ్రామం అంటే ఏమిటి?

మీ కథ ఏ అంశం మీద రాస్తున్నారు మరియు మీ కథ యొక్క పూర్తి సారాంశం మూడు వాక్యాలలో రాయాలి.

మా కథ పోటీలో ఉన్నట్లు మేము ఎలా తెలుసుకోవాలి?

మీరు స్వీయప్రచురణ చేసేటప్పుడు “నాన్నకు ప్రేమతో” అనే వర్గం సెలెక్ట్ చేసుకుంటే చాలు మీ కథ పోటీలో ఉన్నట్లే.

ఏమి రాయాలి?

నాన్నకు సంబంధించిన ఎలాంటి కథ అయినా రాయవచ్చు. నాన్నయొక్క గొప్పదనం, ఒక నాన్న ఎలా ఉండాలి మరియు ఎలా ఉండకూడదో కూడా రాయవచ్చు. కథలో నాన్న పాత్ర ఉంటే చాలు.

నియమాలు :-

1. కథలు మీ స్వంతమై ఉండాలి. ఇది వరకు ప్రతిలిపిలో ప్రచురించిన కథలు పోటీకి స్వీయప్రచురణ చేయరాదు.

2. పదహైదు(15) కథల వరకు పోటీకి స్వీయ ప్రచురణ చేయవచ్చు.

3. పోటీ కోసం కథను స్వీయ ప్రచురణ చేసేటప్పుడు సంగ్రహం అనే చోట రెండు లేదా మూడు వాక్యాలలో కథ యొక్క సారాంశాన్ని తప్పకుండా రాయగలరు.

సందేహాలకు :telugu@pratilipi.comకి మెయిల్ చేయగలరు.

Leave a Reply

%d bloggers like this: